8, అక్టోబర్ 2021, శుక్రవారం

దుర్గముడు ఎవరు..? ఎలా పుట్టాడు. ఎలా సంహరించబడ్డాడు.

 దుర్గముడు ఎవరు..? ఎలా పుట్టాడు. ఎలా సంహరించబడ్డాడు.

-------------------------------------------------------------------------------------------------------

 దేవి నవరాత్రుల సందర్భంగా మన చానల్ నుంచి దుర్గాదేవి మహిములను అమ్మవారి విశిష్టతను వీడియలుగా అందిస్తున్నాము. ఇది 4వ భాగం వీడియో...

ఈ వీడియోలో దుర్గముడు ఎవరు..? ఎలా పుట్టాడు. ఎలా సంహరించబడ్డాడు. పరమేశ్వరి దుర్గాదేవిగా ఎలా మారింది. ఆ అవతారం వెనుక వున్న కథ ఏమిటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. 5వ భాగం వీడియో కూడా చూడాలి అనుకుంటే మన చానల్ని సబ్  చేయండి.

-------------------------------------------------------------------------------------------------------



కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యాక్షుడు అతడి వంశంలో రురుడు అనే దానవుడు పట్టాడు. అతని కుమారుడే దుర్గముడు. దుర్గముడు చాలా క్రూర స్వభావం కలవాడు. కఠినాత్ముడు. ఒక సారి దుర్గముడు తన మంత్రులతో కలిసి సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో దుర్గముడు మాట్లాడతూ దేవ దానవ యుద్ధం చాలా సార్లు జరిగింది. నిజం చెప్పాలంటే దేవతల కన్నా దానవులే భలవంతులు. యుద్ధ నైపుణ్యం దానవులకే ఉంది. అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు. దీనికి కారణం ఏమిటి..? అని సభలోని వారిని అడిగాడు. దీనికంతటికి కారణం వేదాలు. వేదోక్తంగా భూలోకంలోని బ్రాహ్మణులు హెూమాలు చేస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్నారు. వాటిలో హవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు. హావిర్భాగం ఇవ్వడంతో దేవతలకు బలం పెరుగుతుంది. 



-------------------------------------------------------------------------------------------------------

అందుకే దానవులు ఓడిపోతున్నారు. ఒకవేళ హవిర్భాగము గనుక దేవతలకు అందకపోతే, వారి బలం పెరగదు. అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు. యజ్ఞయాగాలు జరగాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలను లేకుండ చేస్తే బలం రాదు కదా..! ఈ రకంలో ఆలోచించి వేదాలను తన ఆధీనం చేసుకోవాలి అనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వతాలకు వెళ్లి బ్రహాదేవుని గురించి వేయి సంవత్సరాలు అత్యంత ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి, పట్టుదలకు మెచ్చి బ్రహ్మాదేవడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభూ నీ వద్ద ఉన్న వేదాలను నా వశం కావించు అన్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తూ అన్నాడు.

-------------------------------------------------------------------------------------------------------

వేదాలు దుర్గముడి ఆధీనంలోకి తక్షణమే వచ్చాయి. ఆ క్షణం నుంచి బ్రాహ్మణులు వేద ప్రవచనం చేయలేకపోయారు. వేదోక్త విధులు జరగడం లేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయాడు. దానివల్ల వర్షాలు కురవడం ఆగిపోయాయి. చెరువులు, బావులు ఎండిపోయాయి. పంట పొలాలకు నీరు లేదు. పంటలు పండటం లేదు. దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. హవిర్భాగాలు లేక దేవతలు వారి శక్తి నశించి తేజోహీనులు అయ్యారు. ఇదే అదునుగా తీసుకుని రాక్షసులు స్వర్గసీమ మీద దాడి చేశారు. దేవతలు కూడా తిరిగి యుద్ధం చేశారు. కాని వారికి శక్తి లేక దానవుల ఎదుట నిలబడలేకపోయారు. అక్కడి నుంచి అరణ్యాలకు పారిపోయారు.


 

-------------------------------------------------------------------------------------------------------

మిగిలిన ప్రజలంతా ఆ పరమేశ్వరిని వేడుకున్నారు. అమ్మా.. తిండి తిని ఎన్నో రోజులు అయింది. ఆకలితో మలమలమాడిపోతున్నాము. కొంత మంది చనిపోతున్నారు. బ్రతికున్న మేము వచ్చి నిన్ను ప్రార్ధిస్తున్నాము. కరుణించు మాతా... కరుణించు... దుర్గముడి వల్లనే మాకు ఈ దుస్థితి పట్టింది. మమ్మల్ని నీవే రక్షించాలి అని ప్రార్థించారు. అప్పుడు ఆమె వళ్లంతా కళ్లు చేసుకుని వారి బాధలు విన్నది. ఎంతైనా తల్లి మనస్సు కదా.. వారందరినీ చల్లగా చూసింది. అందుచేతనే శతాన్ని అని పిలవబడింది. ప్రజల బాధలు విన్న పరమేశ్వరి కూడా బాధపడింది. క్షణం ఆలస్యం చేయకుండా పరమేశ్వరి ప్రజలు తినడానికి పండ్లు, కూరలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అందుచేతనే ఆమె శాకంబరి అని అనబడింది. 

-------------------------------------------------------------------------------------------------------

ఇంద్రాది దేవతలు అరణ్యాలలోనూ, కొండ గుహాలలోనే దాక్కున్నారనే విషయం దుర్గముడికి తెలిసింది. దుర్గముడి సేన దేవతల మీదకు యుద్ధానికి వచ్చారు. రాక్షసుల దాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరిని అమ్మా శరణు.. శరణు అని వేడుకున్నారు.. వెంటనే ఆ తల్లి ఉగ్రరూపంతో పత్యక్షం అయింది. పరమేశ్వరికీ, రాక్షసులకు భీకరమైన యుద్ధం జరిగింది. దేవి ఒంటరిగా వచ్చిందని గ్రహించి రాక్షసవీరులు అనేక మంది ఆమెను చుట్టుముట్టారు. దేవితో యుద్ధానికి తల పడుతున్నారు. అప్పుడు పరమేశ్వరి ఉగ్రరూపం ధరించి.. ఆమె శరీరం నుంచి కాళి, తారిణి, బాల, భైరవి, బగళ, మాతంగి వంటి శక్తులతో పాటు ఇంకా అనేక శక్తులు ఉద్భవించాయి. అసురులకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కాని క్షణ కాలంలో అసురులను ఆ శక్తులు సంహరించాయి.

-------------------------------------------------------------------------------------------------------

ఈ పోరు పది రోజులు జరిగింది. ఇక పదకొండవ రోజున దుర్గముడు యుద్ధరంగానికి వచ్చాడు. పరమేశ్వరికీ, దుర్గముడికి భీకరమైన యుద్ధం జరిగింది. పరమేశ్వరి ఆ రాక్షసుడిపై పదిహేను బాణాలు ప్రయోగించింది. వాటిలో నాలుగు బాణాల వల్ల గుర్రాలు మరణించాయి. ఒక బాణంతో సారధి మరణించాడు. రెండు బాణాలతో దుర్గముడి కన్నులు ఊడిపోయాయి. రెండు బాణాతో అతని భుజాలు తెగిపోయాయి. ఒక బాణంతో రథం విరిగిపోయింది. ఐదు బాణాలతో రాక్షసుడు నెత్తురు కక్కుకుని మరణించాడు. ఈ రకంగా దుర్గముడి సంహరం జరిగింది. కాబట్టే దుర్గాదేవి. అని పిలవబడింది.

ఈ వీడియో మీకు నచ్చితే like Share చేయండి

#VARAHI_TALKS 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...