మీరు చూస్తున్నది శివపురాణం
శివుడిని ఎలాగైనా సరే అవమానించాలని దక్షప్రజాపతి ఒక ఆలోచన చేశాడు. అందులో భాగంగా ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడు. ఆ యఒ్ఙానికి ఒక్క శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా యజ్ఞం పనులు మొదలు పెట్టాడు. సామాన్యదేవతలతో పాటు అగ్రదైవాలు, మహామునులను కూడా పిలిచాడు. హరిద్వార సమీపంలో ఒక క్షేత్రాన్ని యెంచుకున్నాడు. ఒక్కొక్కరిగా ఆ యఒ్ఙానికి రావడం మొదలు పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలికి, పేరు పేరునా పకలరించి వారికి విడుదులు ఏర్పాటు చేశాడు. భృగ్వాదులు మొత్తం యైనభై ఎనిమిది వేలమందీ ఋత్విక్కులుగా ప్రవర్తిస్తున్నారు. ఉద్గాతలు, ఆధ్వర్యులు హోతలూగా అరవై నాలుగు వేలమంది నియమింపబడ్డారు. ఋషిసప్తకం “గాధ” అంటే వేదాంతర్గత చరిత్రములను గానం చేయసాగింది. దిక్పాలకులే యజ్ఞరక్షకులు. యజ్ఞం ప్రత్యక్షమూర్తిగా వెలుగుతుంది. అహుతులు స్వీకరించే నిమిత్తం అగ్ని తన వేనాల్కలతో ప్రజ్వరిల్లిపోతున్నాడు.
-----------------------------------------------------------------------------------
సర్వశుభ సంజ్ఞలాంఛితమైన మహాపురుషుడి దివ్యదేహంలా ఉంది ఆ ప్రాంత మంతా!. ఎటోచ్చి పుర్రెలు ధరిస్తాడు గనుక శివుణ్ణి, ఆయనతో కాపురం చేస్తుంది గనుక అంబనీ ఆహ్వానించలేదు. అంతమందీ వచ్చినా కూడా ఆ లయకారుడు రాకపోవడాన్ని కనిపెట్టాడు దధీచి. వెంటనే దక్షుణ్ణి ప్రశ్నించాడు. ఏమోయ్ దక్షా!.. ఇంతకూ ఆ లయకారుడు లేకుండా యాగం జరిగితోందేమిటి? సమస్త అమంగళ ప్రశమనుడు, సర్వమంగళప్రదాత అయిన శంకరుడు లేనిదే యజ్ఞం బాగుండదు. ఆయనెందువల్ల రాలేదో మరి. ఆ బ్రహ్మతోనో, విష్ణువుతోనో లేదా అర్హులైన ఋషిగణాలతోనో ఓ పిలుపు పిలిపించు. సాంబశివుణ్ణి రప్పించు.. ఆలస్యం అవుతుందన్నాడు.. అలా అంటున్న దధీచి మాటలు ఏకోశానాన నచ్చలేదు దక్షుడికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకన్నా ఆయనేమంత ఘనుడని ప్రత్యేకంగా కబురుపెట్టాలి. అహూతులెవరూ ఆయనకు తీసిపోరు అయినా వల్లకాట్లో మసలేవాడూ, చితాభస్మధారుడూ, అస్థిలాభూషణుడూ, పాములవాడు అయిన అతగాడు రాకపోతే కొంపేమీ మునిగిపోదు. అయినా అప్పట్లో ఏదో బ్రహ్మమాటకొట్టేయ లేక కూతుర్నిచ్చి పెళ్లి చేశానేగాని అదంతా ఆయన గారి గొప్పతనం మాత్రం కాదు. కావాలనే పిలువలేదు నేను.
ఆ గొడవ ఆపి వచ్చినవాళ్లు, మీరందరూ కలిసి యజ్ఞం శుభంగా ముగించండి" అన్నాడు దక్షుడు. మెల్లగా నవ్వాడు దధీచి 'ఇక నువ్వు యఒ్ఙం చేసినట్టేలే!.. అనేసి అక్కడి నుంచి బయలుదేరుతూ. “శివుణ్ణి నిరాకరించినచోట నిమిషం కూడా నిలువబోనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయినా చలించలేదు దక్షుడు. శివుడేకాదు శివ ప్రియులైన ఈ దధీచిలాంటి వాళ్ళు కూడా లేకపోతేనే యజ్ఞానికి. మంచిది పోతేపోనివ్వండి. శుద్ధ విష్ణుపరాయణులూ, వేదమార్గ ప్రవర్తకులూ అయిన వాళ్ళే నాకు చాలు. మీరంతా కలిసి నా యజ్ఞం సఫలం చేయండి అని అక్కడి వారితో అన్నాడు. దధీచితో పాటు మరికొంత మంది బయలుదేరుతూ శివుడు లేని చోట మేముకూడా ఉండము అని చెప్పి వెళ్లిపోయారు. ఇక పోయిన వారు పోగా మిగిలిన వారు యజ్ఞానికి సిద్దమయ్యారు.
ఇక తరువాతి వీడియోలో దక్ష యగ్నానికి సతీదేవి బయలుదేరుట గురించి తెలుసుకుందాం. ఓం నమశివాయా..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి