గోవిందా అంటే అర్థం తెలుసా...!!
గోవిందా అనగానే.. ఏడుకొండలవాడా వెంకట రమణ గోవిందా.. గోవిందా.. అనే మాటప్రతి తెలుగువాడికి వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణలతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు.. గోవిందా.. అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే, గోకులం నాటి కథ తెలుసుకోవాలి.
గోకులంలోని ప్రజలంతా ఇంద్రుడిని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురవుతారు. తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తిపట్టుకుంటాడు కృష్ణుడు. అది చూసిన ఇంద్రుడి గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని క్షమాపణలు వేడుకునేందుకు వెళతాడు.
----------------------------------------------------------------------------------------------------------------
అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటిని రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా, ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూసుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని (అధిపతిని), కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అంటాడు. అప్పటి నుంచి కృష్ణుడు, గోవిందుడు అన్న నామంతో పూజలందుకున్నాడు.
గోవు.. ఇందా.. గోవిందా!
కలౌ వేంకట నాయక:" అన్నట్లు కలి యుగానికి ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ప్రమాణం గల కలియుగానికి ఆధి దైవం, శ్రీ వేంకటేశ్వర స్వామి తానుండవలసిన చోటు "సప్తగిరి "అని ఎంచుకొని, తిరుపతి ప్రాంతానికి వచ్చాడట! అక్కడ చిర కాలంగా, ఆశ్రమం ఏర్పరచుకొని, తపస్సు చేసుకుంటూ ఉన్న అగస్త్య మహర్షిని చూచి "ముని పుంగవా! నేను వేంకట నాయకుణ్ణి. ఈ కలియుగానికి అధిపతిని అందరికీ ఆరాధ్య దైవాన్ని ఈ "సప్తగిరి "మీద నివసిద్దామని వచ్చాను. రోజూ క్షీర సేవనం చెయ్యడానికి, నాకు ఒక గోవునిస్తావా అని అడిగాడు.
----------------------------------------------------------------------------------------------------------------
ఋషి ఆ మాటలు విని పులకించి పోయాడు "ఓహో ! ఏమి నా భాగ్యం? సాక్షాత్తూ, వేంకటేశ్వర స్వామియే ! వచ్చి నన్ను! గోవునిమ్మని అడగ వచ్చాడా? అని ఆనందించాడు. ఆశ్రమంలో ఉన్న గోవులు మేత కోసం, అడవిలోకి వెళ్ళడంతో, అగస్త్యుడు చేతులు జోడించి స్వామీ! అలాగే! నీకు గోవును తప్పకుండా ఇస్తాను. నీవు నివసించే స్థలం " ఫలానా "అని ఎంచుకున్నావే! కానీ ఇంకా రాలేదు కదా! మా అమ్మతో, కూడా కలసి వచ్చిన నాడే నీవు గోవును ఇస్తాను" అన్నాడు.
అందుకు ఆనందించిన స్వామి, అలాగే అని అంతర్ధానం అయ్యాడు. కొన్నాళ్ళకి, లోక మాత అయిన లక్ష్మీదేవితో కలిసి స్థిర నివాసం ఏర్పరచుకోటానికి వచ్చాడు.. అప్పుడు మళ్ళీ అగమ్యడి ఆశ్రమానికి వెళ్లాడు స్వామి. అప్పుడు అగస్త్యఋషి అక్కడ లేదు.
----------------------------------------------------------------------------------------------------------------
శిష్యుడెవరో ఉంటే గతంలో జరిగిన సంభాషణ అతనికి స్వామివారు చెప్పారు. అతను "అలాగే! స్వామీ! మా గురువుగారెక్కడికో వెళ్ళారు. రాగానే చెబుతానన్నాడు. స్వామి వెనుదిరిగాడో లేదో! ఆగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వెంటనే శిష్యుడు గోపు విషయం చెప్పి "అడుగో స్వామి!" అని అటుగా చూపించాడు "అలాగా! దేవ దేవుడు నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకపోవడం ఎంత దురదృష్టం! " అని మదిలో నొచ్చుకుంటూ, పాకలో ఉన్న గోవు నౌకదానిని కట్టు విప్పి, గబగబా. వేకటేశ్వరుని వెంటబడి, గోవు ఇందా అని కేకలు వేసుకుంటూ, వెనకాలే వెళ్ళాడు.
'ఇందా అంటే "ఇదిగో తీసుకో!" అని అర్ధం కాబట్టి మునీంద్రుడు ఎలుగెత్తి గోవు ఇందా.. గోవు ఇందా.. గోవిందాగా అని అరుస్తూ వెంటబడి వెళుతూనే ఉన్నాడు. శిఖరాగ్రానికి చేరే సరికి నూటెనిమిది సార్లు ముని "గోవు ఇందా.. గోవిందా !" అని కేకలు వేశాడు.
----------------------------------------------------------------------------------------------------------------
అప్పుడు స్వామి వెనుదిరిగి చూసి "మునీంద్రా! గో... విధిగో! తీసుకో! అనే అర్థంలోనే అన్నావు. అయినా నన్ను నీవు "గోవిందా గోవిందా అని నూటెనిమిది సార్లు అన్నావు కాబట్టి గోవిందుడనేది. నా నామాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది "నాకీ గోవిందనామం ఎంతో ప్రీతి పాత్రమయింది. నీలాగే ఈ కొండనెక్కే నా భక్తులు, నన్నుద్దేశించి "గోవిందా ! గోవిందా! "అని నూటెనిమిది సార్లు పలికితే వాళ్ళకి! మోక్షమిస్తాను " అని వాగ్దానం చేసి అగస్త్యుడిచ్చిన గోవును ఆప్యాయంగా! స్వీకరించాడు.
----------------------------------------------------------------------------------------------------------------
కనుకనే, ఏడుకొండల స్వామిని దర్శించే భక్తులు "ఏడు కొండల వాడా! వెంకట రమణా! గోవిందా! గోవిందా! అడుగు దండాల వాడా! గోవిందా! గోవిందా! ఆపద మ్రొక్కుల వాడా! గోవిందా గోవిందా! అని నోరారా పిల్చుకుంటూ, స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు భక్తులు. గోవింద నామ స్మరణం చేస్తేనే! ఆ స్వామికి! ప్రీతి కదా! సహస్ర నామాలున్నా! ఆ వేంకటేశ్వర స్వామిని ఇలా! "గోవిందా గోవిందా అనే గోవింద నామార్చనతో పిలుస్తూ నేటికీ భక్తులు తరిస్తున్నారు!!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి