శివపార్వతుల కల్యాణం
కైలాస పర్వతానికి కొత్త కళ వచ్చింది. ఆదిదేవుడు కొత్త పెళ్ళికొడుకు అయ్యాడు.. పార్వతీ దేవి సిగ్గుల మొగ్గలు ధరించి కొత్త పెళ్లి కూతురుగా శంకరుని కోసం ఎదురు చూస్తుంది. దేవి గణాలు , శివపార్వతుల కల్యాణం
కైలాస పర్వతానికి కొత్త కళ వచ్చింది. ఆదిదేవుడు కొత్త పెళ్ళికొడుకు అయ్యాడు.. పార్వతీ దేవి సిగ్గుల మొగ్గలు ధరించి కొత్త పెళ్లి కూతురుగా శంకరుని కోసం ఎదురు చూస్తుంది. దేవి గణాలు , దేవగణాలు, విష్ణు పరివారం, ఇంద్రాది దేవతలు శంకరుని కాల్యాణం కోసం కొత్త అలంకారాలతో నగ ధగ ధగలతో అలంకారం అవుతున్నారు.. శివుని దేహం మీద వుండే సర్పాలు సువర్ణ ఆ భరణాలు అయ్యాయి. చితాభస్మం సుంగధ భరితంగా మారింది.
------------------------------------------------------------------------------------------------------------------
దిగుంబరుడు అయిన పరమేశ్వరుడు పట్టు వస్త్రాలతో ధగధగ కాంతులతో కళకళలాడిపోతున్నాడు. విష్ణువు, బ్రహ్మా, ఇతర దేవ తలతో, మరియు పిచాచ గణాలతో కైలాసం ఎప్పుడు లేని విధంగా కొత్త కళను సంతరించుకుంది. ఇక ఆ పరమేశ్వరుని కల్యాణము, అక్కడికి వచ్చిన బంధుగణము పిచాచాల అల్లరి, భేతాళ నృత్యాలు ఇలా ఒకటేమిటి... ఎక్కడా లేని హడావుడి.. ఎప్పుడు చూడని సందడి... ఆదిదేవుని కల్యాణ వైభవం ఎలా ఉందో చూతము రారండి.
శివర్వతుల కల్యాణం నిశ్యయమైంది. ముల్లోకాలన్నీ ఎంతో సంతోసంగా పమేశ్వరుని కల్యాణం కోసం ఎదురు చూస్తున్నాయి. శంకరుని మామగారు అయిన హిమమంతుడు ఆయన కుల గురువును పిలిచి బ్రామ్మాణోత్తమా మీరు నా కుమార్తె, గారాల పట్టి వివాహ లగ్న పత్రికను రాయండి.. అని పురమాయించాడు. అది పూర్తయిన తరువాత తన కుమారులను పిలిచి మీరు వెళ్లి మీ బావ గారు, మగ పెండ్లివారు అయిన శంకరునికి ఈ లగ్న పత్రికను ఇచ్చి రండి అని పంపించాడు. దానిని తీసుకుని పరమేశ్వరుని సన్నిధి చేరారు. పరమేశ్వరునికి చూపించారు. దానిని చూసిన శంకరుడు ఒకింత సిగ్గుతో లగ్న పత్రికను స్వీకరించాడు. తరువాత వచ్చిన వారికి అతిధి సత్కారం చేసి వారిని గౌరవంగా పంపించాడు.
ఆ లగ్న పత్రికను తనివితీరా చూసుకున్న పరమేశ్వరుడు దానిపై వున్న శివ పార్వతుల పేరులను చూసి ఎంతో ఆనందభరితుడు అయ్యాడు. కాసేపు అలా చూసిన తరువాత నారద మహార్షిని పిలిచాడు. మహార్షి మీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. అది ఏమిటంటే మీరు తక్షణమే వెళ్ళ వలసి వుంటుంది. ఈ లగ్న పత్రికను ముల్లోక వాసులందరికీ అందించండి. తమరు ఈ కార్యం చేసే సమయంలో వారితో ఇలా చెప్పండి. శంకరుని మాటగా నేను వచ్చానని ఇది శంకరుని ఆహ్వానం అని చెప్పండి. వారి తరుపున నేను వచ్చాను. అంతే.. మీరు అందరూ బంధుగణంతో సకుటుంబ సపరివార సమేతంగా శివపార్వతుల వివాహానికి రండి అని ఆహ్వానించండి. అని నారదునికి పరమేశ్వరుడు మరి మరీ చెప్పాడు. నారదుడు శంకరుని నమస్కరించి వెంటనే బయలుదేరాడు.
నారాయణా.. నారాయణా... నారాయణా... నారాయణా.. అనుకుంటూ వైకుంఠానికి చేరాడు. మొదటి ఆహ్వాన పత్రికను వైకుంఠవాసునికి ఇచ్చాడు. తరువాత బ్రహ్మా, ఆ తరువాత ఇంద్రాది దేవతలు, అనంతరం మిగిలిన ముల్లోక వాసులకు ఆహ్వాన పత్రికను అందించాడు. అందరిని పేరు పేరునా ఆహ్వానించి చివరికి కైలాసానికి చేరాడు. కైలాస పర్వతం పెళ్లి కళను సందరించుకుంది. కొత్త తోరణాలు, భేరీ నాధాలు, ఢమరుక శబ్దాలు ఒకటా రెండా ఎన్నో కొత్త సందడులు, ఆపుడే కైలాసానికి ఓం ప్రథమంగా విష్ణుమూర్తి వచ్చాడు. గరుడ వాహనదారుడై సపరివార సమేతంగా వైకుంఠ వాసులతో యెక్కడాలేని అట్టహాసంతో వచ్చాడు. ఆయన అడుగు పెట్టడంతోనే కొత్తకళ వచ్చేసింది. వచ్చీ రాగానే శివుడికి సతీసమేతంగా అభివాదం చేశాడు. అనంతరం ఆయనచే నిర్మించబడిన ఆసనాన్ని అధిష్టించి కూర్చున్నాడు అనంతుడు.
ఆ వెనుకే హంసవాహన దారుడై అజుడు సావిత్రీ, సరస్వతీ, గాయత్రీ సమేతంగా వేంచేశాడు. వారి తరువాత దేవేంద్రుడు వచ్చాడు. అంతలోనే మిగిలిన దేవతలు కూడా రివ్వు రివ్వున కైలాసం చేరారు..
ఈ విధంగా ముల్లోక వాసులతో కైలాసం కళకళలాడిపోతుంటే మరో వైపున ఈశ్వరుడిని పెండ్లి కుమారుడిగా చేయడానికి సప్త మాత్రికలు వచ్చారు. శివుడ్ని అలంకరించబోయారు. మహా దేవుని వివాహం అంటే అత్యంత సుందరంగా దీర్చిదిద్దాలి అనుకుంటున్నారు. వాళ్ల మనసులో ఎలా అలంకరించాలి అనుకుంటున్నారో అచ్చం అలాగే మారిపోమాడు ఆ శివుడు.
ఎలా మరాడు అంటే నుదుటున వున్న నిప్పుకన్ను నిలువు తిలకంగా మారింది. చెవులకు వ్రేలాడే సర్పాలు కర్ణకుండలాలుగా మారాయి. మిగిలిన సర్పాలు ఆయన అవయవాలకు సువార్ణ ఆభరణాలుగా మారిపోయాయి. శరీరం మీద వున్న చితాభస్మం సుగంధ భరితంగా మారిపోయింది. ఏనుగుతోలు పట్టు వ స్త్రాలుగా మారిపోయాయి. చివరికి శంకరుడు కొత్త పెండ్లి కొడుకు అయ్యాడు. ఆ రూపంతో బయటకు వచ్చాడు. ఆ సుందర రూపాన్ని చూసి అందరూ ఆశ్యర్యపోయారు. పరమేశ్వరుడేనా ఆనుకున్నారు. భక్తి ప్రవర్తులతో నమస్కరించారు. అప్పుడు విష్ణువు శివుని వద్దకు వెళ్లి శివా... నీ వివాహం పూర్తి వైదిక విధానంలో జరగాలని నా కోరిక. ఇప్పుడు నీ వివాహం ఎలా జరిగితే లోకంలో తక్కిన పెళ్లిళ్లు అలాగే జరుగుతాతాయి. అందువల్ల నందిముఖం స్థాలీపాకంలాంటి వైదిక కర్మలతో కూడుకున్నదిగా వివాహం ఉండాలి. అని ప్రార్ధించాడు. ఉత్తిపుణ్యానికే అడిగిన వరాల ఇచ్చే దయామయుడు శంకరుడు. ఆయన ఇప్పుడు పెండ్లికొడుకు కూడా. మరింత విరివిగా వరాలిస్తున్నాడు. ఎటూ అమ్మవారి కోసం లౌకిక వివాహ లీల ప్రదర్శించబోతున్న స్వామికి విష్ణువు కోరిక ఏపాటిది. శంకరుడు సరే అలాగే కానివ్వండి అని అన్నాడు. తక్షణమే బ్రహ్మా దేవుడు ముందుకు వచ్చాడు. అభ్యుదయ కర్మకాండ గావింపజేశాడు. ఎందరెందరో విప్రులు, అత్రి, అగస్త్యుడు, అరుణపాలుడు, ఉపమన్యుడు, కణ్వ, పిప్పలాదుడు, దదీచి, మార్కండేయుడు, వశిష్ట వేదవ్యాసుడు ఇలా ఒకరేమిటి బ్రహ్మ చెప్పిన పద్ధతిలో వివాహం కార్యక్రమం ఆరంభించారు. అనంతరం మగ పెండ్లివారు పెండ్లికి బయలుదేరరారు.
కొత్త పెళ్లి కొడుకు అయిన శంకరుని వెంట ఒకళ్లా ఇద్దరా.. క్షేత్ర పాలక భైరవులు, తమ సమస్త గణాలతోటి వచ్చారు. అటు విష్ణు పరివారం, ఇటు బ్రహ్మాపరివారం, సర్వాభరణాలతో ముప్పై నూడు కోట్ల మంది దేవతలు, ఆ దేవతలకన్నా అనేక రెట్లు అంటే సుమారు ఇరవై యెనిమిది లక్షల కోట్ల గణాలతో.. విశాఖ, శకువర్ణ కేకరాక్షాది గణాలు, విజయ, వినోద మంగళాట్టహాసాలతో తరలివచ్చారు. శాకినీశక్తులు, యాతుధానులు, బేతాళులు, బ్రహ్మారాక్షసులు, భూత, ప్రేత, పిచాచాలు, వాటి అల్లరికి అంతేలేదు.
వాటికి వ్యతిరేకమయిన దోరణిలో శత మర్కట తుల్యుడైన బ్రమ్మచారి నారదుడి ఆధ్వర్యంలో తుంబుర, హాహా.. హూహూ యిత్యాది గంధర్వుల వీణామృడంగాది మంగళవాద్య ఘోషలు, అందంగా ఆలపిస్తున్నారు. వీళ్లు వాళ్లు అని చెప్పడం ఎలా సాధ్యం, దేవుని పెళ్లికి అందరూ పెద్దలే కదా.. వీరందరితో మహా సందడిగా మామగారు అయిన హిమమంతుడి ఇంటికి మరి కాసేపటిలో చేరుకోబోతున్నారు.
రెండవ భాగం ఉంది. గమనించగలరు.
, విష్ణు పరివారం, ఇంద్రాది దేవతలు శంకరుని కాల్యాణం కోసం కొత్త అలంకారాలతో నగ ధగ ధగలతో అలంకారం అవుతున్నారు.. శివుని దేహం మీద వుండే సర్పాలు సువర్ణ ఆ భరణాలు అయ్యాయి. చితాభస్మం సుంగధ భరితంగా మారింది.
------------------------------------------------------------------------------------------------------------------
దిగుంబరుడు అయిన పరమేశ్వరుడు పట్టు వస్త్రాలతో ధగధగ కాంతులతో కళకళలాడిపోతున్నాడు. విష్ణువు, బ్రహ్మా, ఇతర దేవ తలతో, మరియు పిచాచ గణాలతో కైలాసం ఎప్పుడు లేని విధంగా కొత్త కళను సంతరించుకుంది. ఇక ఆ పరమేశ్వరుని కల్యాణము, అక్కడికి వచ్చిన బంధుగణము పిచాచాల అల్లరి, భేతాళ నృత్యాలు ఇలా ఒకటేమిటి... ఎక్కడా లేని హడావుడి.. ఎప్పుడు చూడని సందడి... ఆదిదేవుని కల్యాణ వైభవం ఎలా ఉందో చూతము రారండి.
------------------------------------------------------------------------------------------------------------------
శివపార్వతుల కల్యాణం నిశ్యయమైంది. ముల్లోకాలన్నీ ఎంతో సంతోసంగా పమేశ్వరుని కల్యాణం కోసం ఎదురు చూస్తున్నాయి. శంకరుని మామగారు అయిన హిమమంతుడు ఆయన కుల గురువును పిలిచి బ్రామ్మాణోత్తమా మీరు నా కుమార్తె, గారాల పట్టి వివాహ లగ్న పత్రికను రాయండి.. అని పురమాయించాడు. అది పూర్తయిన తరువాత తన కుమారులను పిలిచి మీరు వెళ్లి మీ బావ గారు, మగ పెండ్లివారు అయిన శంకరునికి ఈ లగ్న పత్రికను ఇచ్చి రండి అని పంపించాడు. దానిని తీసుకుని పరమేశ్వరుని సన్నిధి చేరారు. పరమేశ్వరునికి చూపించారు. దానిని చూసిన శంకరుడు ఒకింత సిగ్గుతో లగ్న పత్రికను స్వీకరించాడు. తరువాత వచ్చిన వారికి అతిధి సత్కారం చేసి వారిని గౌరవంగా పంపించాడు.
------------------------------------------------------------------------------------------------------------------
ఆ లగ్న పత్రికను తనివితీరా చూసుకున్న పరమేశ్వరుడు దానిపై వున్న శివ పార్వతుల పేరులను చూసి ఎంతో ఆనందభరితుడు అయ్యాడు. కాసేపు అలా చూసిన తరువాత నారద మహార్షిని పిలిచాడు. మహార్షి మీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. అది ఏమిటంటే మీరు తక్షణమే వెళ్ళ వలసి వుంటుంది. ఈ లగ్న పత్రికను ముల్లోక వాసులందరికీ అందించండి. తమరు ఈ కార్యం చేసే సమయంలో వారితో ఇలా చెప్పండి. శంకరుని మాటగా నేను వచ్చానని ఇది శంకరుని ఆహ్వానం అని చెప్పండి. వారి తరుపున నేను వచ్చాను. అంతే.. మీరు అందరూ బంధుగణంతో సకుటుంబ సపరివార సమేతంగా శివపార్వతుల వివాహానికి రండి అని ఆహ్వానించండి. అని నారదునికి పరమేశ్వరుడు మరి మరీ చెప్పాడు. నారదుడు శంకరుని నమస్కరించి వెంటనే బయలుదేరాడు.
------------------------------------------------------------------------------------------------------------------
నారాయణా.. నారాయణా... నారాయణా... నారాయణా.. అనుకుంటూ వైకుంఠానికి చేరాడు. మొదటి ఆహ్వాన పత్రికను వైకుంఠవాసునికి ఇచ్చాడు. తరువాత బ్రహ్మా, ఆ తరువాత ఇంద్రాది దేవతలు, అనంతరం మిగిలిన ముల్లోక వాసులకు ఆహ్వాన పత్రికను అందించాడు. అందరిని పేరు పేరునా ఆహ్వానించి చివరికి కైలాసానికి చేరాడు. కైలాస పర్వతం పెళ్లి కళను సందరించుకుంది. కొత్త తోరణాలు, భేరీ నాధాలు, ఢమరుక శబ్దాలు ఒకటా రెండా ఎన్నో కొత్త సందడులు, ఆపుడే కైలాసానికి ఓం ప్రథమంగా విష్ణుమూర్తి వచ్చాడు. గరుడ వాహనదారుడై సపరివార సమేతంగా వైకుంఠ వాసులతో యెక్కడాలేని అట్టహాసంతో వచ్చాడు. ఆయన అడుగు పెట్టడంతోనే కొత్తకళ వచ్చేసింది. వచ్చీ రాగానే శివుడికి సతీసమేతంగా అభివాదం చేశాడు. అనంతరం ఆయనచే నిర్మించబడిన ఆసనాన్ని అధిష్టించి కూర్చున్నాడు అనంతుడు.
------------------------------------------------------------------------------------------------------------------
ఆ వెనుకే హంసవాహన దారుడై అజుడు సావిత్రీ, సరస్వతీ, గాయత్రీ సమేతంగా వేంచేశాడు. వారి తరువాత దేవేంద్రుడు వచ్చాడు. అంతలోనే మిగిలిన దేవతలు కూడా రివ్వు రివ్వున కైలాసం చేరారు..
------------------------------------------------------------------------------------------------------------------
ఈ విధంగా ముల్లోక వాసులతో కైలాసం కళకళలాడిపోతుంటే మరో వైపున ఈశ్వరుడిని పెండ్లి కుమారుడిగా చేయడానికి సప్త మాత్రికలు వచ్చారు. శివుడ్ని అలంకరించబోయారు. మహా దేవుని వివాహం అంటే అత్యంత సుందరంగా దీర్చిదిద్దాలి అనుకుంటున్నారు. వాళ్ల మనసులో ఎలా అలంకరించాలి అనుకుంటున్నారో అచ్చం అలాగే మారిపోమాడు ఆ శివుడు.
------------------------------------------------------------------------------------------------------------------
ఎలా మరాడు అంటే నుదుటున వున్న నిప్పుకన్ను నిలువు తిలకంగా మారింది. చెవులకు వ్రేలాడే సర్పాలు కర్ణకుండలాలుగా మారాయి. మిగిలిన సర్పాలు ఆయన అవయవాలకు సువార్ణ ఆభరణాలుగా మారిపోయాయి. శరీరం మీద వున్న చితాభస్మం సుగంధ భరితంగా మారిపోయింది. ఏనుగుతోలు పట్టు వ స్త్రాలుగా మారిపోయాయి. చివరికి శంకరుడు కొత్త పెండ్లి కొడుకు అయ్యాడు. ఆ రూపంతో బయటకు వచ్చాడు. ఆ సుందర రూపాన్ని చూసి అందరూ ఆశ్యర్యపోయారు. పరమేశ్వరుడేనా ఆనుకున్నారు. భక్తి ప్రవర్తులతో నమస్కరించారు. అప్పుడు విష్ణువు శివుని వద్దకు వెళ్లి శివా... నీ వివాహం పూర్తి వైదిక విధానంలో జరగాలని నా కోరిక. ఇప్పుడు నీ వివాహం ఎలా జరిగితే లోకంలో తక్కిన పెళ్లిళ్లు అలాగే జరుగుతాతాయి. అందువల్ల నందిముఖం స్థాలీపాకంలాంటి వైదిక కర్మలతో కూడుకున్నదిగా వివాహం ఉండాలి. అని ప్రార్ధించాడు. ఉత్తిపుణ్యానికే అడిగిన వరాల ఇచ్చే దయామయుడు శంకరుడు. ఆయన ఇప్పుడు పెండ్లికొడుకు కూడా.
------------------------------------------------------------------------------------------------------------------
మరింత విరివిగా వరాలిస్తున్నాడు. ఎటూ అమ్మవారి కోసం లౌకిక వివాహ లీల ప్రదర్శించబోతున్న స్వామికి విష్ణువు కోరిక ఏపాటిది. శంకరుడు సరే అలాగే కానివ్వండి అని అన్నాడు. తక్షణమే బ్రహ్మా దేవుడు ముందుకు వచ్చాడు. అభ్యుదయ కర్మకాండ గావింపజేశాడు. ఎందరెందరో విప్రులు, అత్రి, అగస్త్యుడు, అరుణపాలుడు, ఉపమన్యుడు, కణ్వ, పిప్పలాదుడు, దదీచి, మార్కండేయుడు, వశిష్ట వేదవ్యాసుడు ఇలా ఒకరేమిటి బ్రహ్మ చెప్పిన పద్ధతిలో వివాహం కార్యక్రమం ఆరంభించారు. అనంతరం మగ పెండ్లివారు పెండ్లికి బయలుదేరరారు.

#varahi talks