1, నవంబర్ 2021, సోమవారం

శివుడి కోసం తన కన్నునే అర్పించిన విష్ణువు

శివుడి కోసం తన కన్నునే అర్పించిన విష్ణువు

శివపురాణం 31వ భాగం

అడిగిన వెంటనే వరాలు ఇచ్చే దయామయుడు ఆ పరమేశ్వరుడు.. భక్తుల కోరికలు తీర్చి, వారి సంతోషమే . తన సంతోషంగా భావించి ఆనంద తాండవం చేస్తాడు ఆ శంకరుడు చిన్న ఉదాహరణగా మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకుని నీవే దిక్కు అంటూ ప్రార్థిస్తే చటుక్కన వచ్చి ఆ యుముడినే దండించిన భక్తవశంకరుడు... అలాంటిది వైకుంఠవాసుడు ఆ శ్రీమన్నారాయణుడు అడిగితే కాదంటాడా...! లేదు. లేదు... తక్షణమే ప్రత్యక్షం అవుతాడుకదా.... మరి శ్రీమహావిష్ణువు ఎందుకు శివుడి గురించి తపస్సు చేయాల్సి వచ్చింది. శివుడు ప్రత్యక్షం అయ్యి ఏం వరం ఇచ్చాడు. అంతటి అవసరం ఏమొచ్చిందో తెలుసుకుందాం...

--------------------------------------------------------------------------------------



ఈ వీడియోని చూసే ముందు మీరు చేయాల్సిన చిన్న సహాయం ఈ వీడియోకి లైక్, చేసి మీ అభిప్రాయాన్ని తెలపగలరు. మీ అభిప్రాయం మరిన్ని వీడియోలు చేయడానికి మరింత సమాచారాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది.

--------------------------------------------------------------------------------------

దేవతలు చాలా భలవంతులు అలాంటి బలవంతులపై దానవులు అనేక సార్లు దాడులు చేశారు. చాలా సార్లు దేవతలు స్వర్గాన్ని వదిలి అడవులకు పారిపోయారు. మళ్లీ మళ్లీ.. దానవులు దాడులు చేస్తుండటంతో విసిగి పోయిన దేవతలు ఇక భరించలేక నారాయణ రక్త .....రక్ష... పద్మా క్ష..... రక్షించూ అంటూ వైకుంఠవాసుడి సన్నిధికి చేరారు. తమరే మమ్మల్ని రక్షించాలి.. ఆ దానవుల పెట్టే బాధలు భరించలేకున్నాము... వారి ఆగడాలు మితి మీరి పోతున్నాయి.... ! స్వర్గలోక వాసులు వారి నుంచి పారిపోతున్నారు. 

--------------------------------------------------------------------------------------

చాలా మంది మునులు మరణించారు. అగ్ని గుండాలను ధ్వంసం చేస్తున్నారు. ఒకటా రెండా ఏమని చెప్పము మా బాధలు తీర్చగలవారు అని మీ వద్దకు వచ్చాము.. అని విష్ణువుకు వారి వేధనను అంతా వివరించారు. అప్పుడు శ్రీ మహా విష్ణువు వారి బాధలు అన్ని ప్రశాంతంగా విని / దేవతలారా ఇది కాలమహిమే.. అందుకే వారు అలా చేస్తున్నారు. / మీరు బాధపడకండి. దీనికి ఒక్కటే మార్గం ఆ కంఠేకాలుణ్ణి ఆరాధించాలి.. కష్టం తీరే విధానాన్ని నేను కనుగొంటాను. మీరు ఇక ధైర్యంగా వెళ్లండి. అని పద్మాక్షుడు వారిని పంపించాడు..

--------------------------------------------------------------------------------------

అనంతరం విష్ణువు వైకుంఠం నుంచి బయలు దేరాడు. కంఠేకాలుణ్ణి ఆరాధించడానికి కైలాసం దగ్గరలో ఒక గుండాన్ని ఏర్పాటు చేశాడు. దానిలో అగ్నిని రగిల్చి వేద మంత్రయుక్తంగా హోమం చేయడం ప్రారంభించాడు. ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ... అంటూ నిత్యం పార్థివ లింగార్చన చేయడానికి సంకల్పించాడు. ఒక నాడు విష్ణువు మానస సరోవరానికి వెళ్లి వెయ్యి కమలాలు తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. శివ సహాస్రనామ స్తోత్రం చదువుతూ పువ్యులతో పూజ చేయడం ప్రారంభించాడు. ఒక్కో పువ్వు వేసి ఆ పరమేశ్వరుడి నామాన్ని జపిస్తున్నాడు... ఓం నమశ్చివాయా..అంటూ చివరి నామానికి వచ్చాడు. తొమ్మిది వందల తొంబై తొమ్మిది నామాలు పూర్తయ్యాయి. చివరిగా ఒక్క నామం మిగిలింది. పువ్వులేమో అయిపోయాయి.

--------------------------------------------------------------------------------------

 ఒక్క పువ్వు ఉంటే సహాస్ర నామాలు పూర్తవుతాయి. కాని విచిత్రం ఏమిటంటే తెచ్చింది వేయి పువ్వులు / కాని చివరికి ఒకటి తగ్గింది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు విష్ణువు.. అప్పుడు విష్ణువుకి ఒక ఆలోచన వచ్చింది. తనని పద్మాక్షుడు అని పిలుస్తారు.. అందువల్ల తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని అర్పించాలి అనుకున్నాడు. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన నేత్రాని పెకిలించి సహాస్ర నామాన్ని పూర్తి చేయాలి అని పూనుకుంటున్నాడు. అప్పుడు పెళపెళ రావాలతో మిలమిల మెరుపులతో దిక్కులు పిక్కటిల్లే విధంగా పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్ధం వెలుగులోంచి ఆదిదేవుడు.. ఆ పరమేశ్వరుడు, ప్రత్యక్షం అయ్యాడు. పద్మాక్ష... ఆగు.. ఆగు.. అంత పని చేయకు... నీ నేత్రం అగ్నికి ఆహుతి అయితే ఈ లోకం అంధకారం అవుతుంది.

--------------------------------------------------------------------------------------

ముల్లోకాలన్నీ నాశనం అవుతాయి. ప్రళయం సంభవిస్తుంది. అందుచేత తమరు ఈ కార్యాన్ని చేయకండి. తమరు చేసిన పూజకు నేను ఎంతగానో సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో పద్మాక్షా అని శంకరుడు ఎంతో ప్రసన్న వదనంతో విష్ణువుని అడిగాడు..

--------------------------------------------------------------------------------------

అప్పుడు విష్ణువు ఈ విధంగా అన్నాడు.. హే సర్వేశ్వరా... దైత్యదానవ వర్గాలు చెడు గుణాలను అందిపుచ్చుకుని ముల్లోక వాసులను కలవర పెడుతున్నారు. దానవుల బాధలు భరించలేక ఆదిత్యుడు అవస్థలు పడి అరణ్యాలకు వెళ్లిపోయాడు..! మునులను హింసిస్తున్నారు. దేవతలు భయంతో పారిపోతున్నారు. వీటన్నింటిని ఆపాలంటే నాకు మరింత శక్తి కావాలి ఇప్పుడు నాకున్న శక్తి వారిని ఎదురించడానికి సరిపోవడం లేదు. నాకు వున్న అస్త్రాలు చాలడం లేదు.. బ్రహ్మా దేవుడు దానవులకు అనేక వరాలు ఇచ్చాడు... ఆ వరాల ప్రభావంతో దానవులు మితి మీరిపోతున్నారు. వారిని శిక్షించాలి అంటే నాకు ఇంకా శక్తివంతమైన అస్త్రా లు కావాలి.. వానిటి ఇవ్వగలిగేది తమరు మాత్రమే.. అందువల్ల ఈ కార్యానికి పూనుకున్నాను అని ప్రార్ధించాడు.




--------------------------------------------------------------------------------------

తక్షణమే పరమేశ్వరుడు తన శక్తిని ఉపయోగించి ఒక చక్రాన్ని నిర్మించాడు అది ఎంతో మహిమలగది దానిని శ్రీహరికి అందించాడు.. అదే సుదర్శన చక్రం.. నాటి నుంచి విష్ణువు చక్రపాణి, చక్రధరుడు, చక్రి అనే పేర్లు వచ్చాయి. శివుడు ప్రసాదించిన సుదర్శన చక్రంతో దానవులను అంతం చేసి దేవతలకు సంతోషాన్ని ప్రసాదించాడు శివుడిని భక్తితో వేడుకుంటే ఒక్క సుదర్శన చక్రం ఏమిటి ఏదైనా ఇవ్వగలిగే ఆ పరమేశ్వరుడు ఏన్నో వరాలను శ్రీ హరికి ప్రసాదించాడు.

--------------------------------------------------------------------------------------

శ్రీ మహా విష్ణువు కాబట్టి వెంటనే ప్రత్యక్షం అయ్యాడు.. మరి సామాన్య జనులు అడిగితే ప్రత్యక్షం అవుతాడా.. అనే సందేహం రావచ్చు దానికి నిదర్శనంగా తరువాత వీడియోలో తప్పకుండా తెలుసుకుంటారు.

--------------------------------------------------------------------------------------

ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్లో ఓం నమశ్శివాయా అని 

ఆ పరమేశ్వరుడుని మనసారా ప్రార్ధించండి

#varahi talks


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...