రామప్ప దేవాలయం...
------------------------------------------------------------------------------------------------------------
రామప్ప దేవాలయం.. ముందుగా ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం... ఈ ఆలయాన్ని నిర్మించింది రేచర్ల రుద్రుడు. ఇతడు గణపతి దేవ సైన్యాధిపతి. కానీ ఈ ఆలయ శిల్పి మాత్రం కర్ణాటకాకు రామప్ప. ఇతడిని స్తపతి అంటారు. రామప్ప చెక్కిన ఈ ఆలయానికి అతని పేరుమీదే రామప్ప దేవాలయం అని పిలవబడింది. శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని వెలుగొందుతుంది.
-------------------------------------------------------------------------------------------------------------
దక్షిణ భారతంలో ఆలయాన్ని చెక్కిన శిల్పిపేరు మీద వున్న ఒకే ఒక్క ఆలయం ఇదే కావడం విశేషం. కాకతీయ రాజుల కళానైపుణ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం.. కాకతీయుల కాలంలో కి.శ. 1213లో ఈ ఆలయం నిర్మించబడింది. తెలంగాణాలోని గొప్ప ఆలయాల్లో ఇది ఒకటి. దీనినే రామలింగుశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని విశ్వబ్రహ్మాణుల ఆధ్వర్యంలో గొప్ప శిల్ప నైపుణ్యంతో తీర్చిదిద్దబడింది. కాకతీయుల కాలంలో చెరువులు తవ్వించడం అనేది ఎక్కువగా జరిగేది. అందులో భాగంగానే ఈ దేవాలయం పక్కనే ఒక సరస్సును నిర్మించారు.
-------------------------------------------------------------------------------------------------------------
నేటికీ ఎన్నో ఊళ్లకు సాగు నీరు అందిస్తున్నది. ఈ దేవాలయం ఉన్న ఊరిపేరు పాలంపేట ఇది ఇప్పటిది కాదు 13 నుంచి 14 శతాబ్ధాల మధ్య ఎంతో వైభవంగా వెలుగొందింది. ఈ దేవాలయం నిర్మాణ సమయంలో కాకతీయ రాజు ఒక శిలాశాసనం వేయించాడు. అందులో స్పష్టంగా చెప్పబడింది. ఈ ఆలయానికి ఇంతటి గొప్ప రూపునిచ్చింది గణపతిదేవ సైన్యాధిపతి రేచ్చర్ల రుద్రయ్య, మరియు ఆలయానికి పని చేసిన వారి వివరాలు శాసనంలో ఉన్నాయి.
-------------------------------------------------------------------------------------------------------------
ఈ ఆలయ ప్రత్యేకతలు
1. ఇసుకపై ఆలయ నిర్మాణం చేయడం
2. ఆలయ నిర్మాణానికి వాడిన రాయి నేటికీ రంగు కోల్పోకుండా ఉండటం.
3. నీటిలో తేలియాడే ఇసుకలతో ఆలయ నిర్మాణం చేయడం
4. అద్భుత శిల్పకళా నైపుణ్యం
---------------------------------------------------------------------------------------------------------
ఈ దేవాలయంలో ప్రధాన ధైవం రామలింగేశ్వరుడు. విష్ణువు అవతారం రాముడుగా ఈ ఆలయంలో దర్శనం ఇస్తున్నాడు. ఈ ఆలయం కాకతీయ రాజుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాయితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉండి ఎంతో సుందరంగా ఉంటుంది.
-------------------------------------------------------------------------------------------------------------
ఈ ఆలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించబడింది. ఇక్కడి ఆలయానికి ఎదరుగా ఉన్న నందికి ఒక ప్రత్యేక ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తిపట్టుకుని ఎప్పుడు ఆ శివుడు పిలుస్తాడా పరుగున వెళదాము అన్నట్లు ఉంటుంది. నందికి ముందు భాగాన నిలబడి ఎక్కడి నుంచి చూసినా మనల్నే గమనిస్తున్నట్లు ఉంటుంది.
-------------------------------------------------------------------------------------------------------------
1213లో నిర్మించిన ఈ ఆలయంలో సుమారు 110 సంవత్సరాల పాటు ధూపధీప నైవేధ్యాలతో ఎంతో శోభాయమానంగా వెలుగొందింది. తరువాతి కాలంలో ముస్లీంల ఆదిపత్యం మొదలవడంతో కాకతీయ సామ్రాజ్యం అంతం అయింది. ముస్లీంల పాలన మొదలైంది. వారి కాలంలో సుమారు 550 సవంత్సరాల పాటు ఆ దేవాలయానికి పూజలు లేకుండా ఆలయం చీకటిగా మారి అధ్వాన్న దశలోకి వెళ్లింది. ఒకరోజు ముస్లీంల సామంత రాజు అయిన అసీఫ్ జహీల్ అనే రాజు వేటకు వెళ్లాడు. అతనికి ఈ గుడి కనిపించింది. అక్కడ అధ్వాన్నంగా ఉన్న రాతి స్తంభాలను చూసి చలించిపోయాడు. సిమెంట్‌తో వాటిని మళ్లీ అతికించి తిరిగి నిలబెట్టాడు. ఆలయ పరిసరాలను శుభ్రం చేయించి మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చాడు. అలా రెండవ సారి వెలుగులోకి వచ్చింది.
-------------------------------------------------------------------------------------------------------------
ఈ ఆలయం. మళ్లీ 1951వ సంవత్సరంలో పురావస్తు శాఖ వారు ఆధీనంలోకి తీసుకుని సంరక్షించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపద జబితాలోకి చేరింది. యూనెన్కో జాబితాలో చేరి ప్రపంచ వారసత్వ హోదా పొందింది.
-------------------------------------------------------------------------------------------------------------
రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలంపేట అనే గ్రామంలో ఉంది.
#varahitalks

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి