8, అక్టోబర్ 2021, శుక్రవారం

దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి.. కనక దుర్గగా ఎలా మారింది

దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి.. 

కనక దుర్గగా ఎలా మారింది

-------------------------------------------------------------------------

దేవి నవరాత్రుల సందర్భంగా మన చానల్ నుంచి దుర్గాదేవి మహిమలను అమ్మవారి విశిష్టతను వీడియలుగా అందించడం జరుగుతుంది. ఇది 3వ భాగం వీడియో...



-------------------------------------------------------------------------

ఈ వీడియోలో దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి.. కనక దుర్గగా ఎలా మారింది. ఆ అవతారం వెనుక వున్న కథ ఏమిటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి చాలు.

-------------------------------------------------------------------------

పూర్వం ఈ భూమండలాన్ని సురధుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ప్రజలను సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉండేవాడు. రాజ్య ప్రజలు సిరి సంపదలతో, ధన ధాన్య సమృద్ధితో నిత్యం కళకళలాతూ ఉండేవారు. ఇంతటి గొప్ప రాజ్యానికి ఆపద వచ్చింది. అందేంటంటే పొరుగు దేశ రాజులు సురధుడి రాజ్యం మీదకు యుద్ధాన్ని ప్రకటించాయి. ఒక రోజు యుద్ధానికి వచ్చిన వారితో సురధుడు పోరు సాగించాడు. అయినా వారి ముందు నిలవలేక ఓడిపోయాడు. రాజ్యమును కోల్పోయిన సురథుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ మేధసుని ఆశ్రమం ఉంటే ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. ఒక రోజు సురధుడిని మునీంద్రుడైన మేధస్సుడు చూసి సత్కారాలు చేశాడు. తన ఆశ్రమంలోనే అతనికి చోటు ఇచ్చా డు. కాని రాజుకు మాత్రం తన రాజ్యం ఎలా ఉందో.. ప్రజలు ఏం చేస్తున్నారో అనే దిగులుతో బాధపడుతున్నాడు. 



-------------------------------------------------------------------------

ఒకరోజు ఆ ఆశ్రమ సమీపంలోనే ఏడుస్తూ "సమాధి" అనే పేరుగల వైశ్యునిడి చూచాడు రాజు. అతను చూస్తే గొప్ప ధనవంతులా కనిపించాడు. మరి అలాంటి వాడికి ఇంతటి కష్టం ఏమోచ్చి ంది. అనుకున్నాడు. వెంటనే అతని వద్దకు వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. దానికి వైశ్యుడు భార్యాపుత్రులు నేను లేకుండా ఎలా బతుకుతున్నారో.. ఏం చేస్తున్నారో అని తలుచుకుని బాధపడుతున్నాను అని చెప్పాడు. మరి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే ధన వ్యామోహంతో తనను భార్యాపుత్రులే విడిచిపెట్టారని ఆయనకు వివరించాడు.. అప్పుడు రాజు ఇలా అనుకున్నాడు. 

-------------------------------------------------------------------------

తన సంతోషాన్ని కోల్పోయిన అతడు నిరంతరం తన భార్యాపుత్రుల గురించే ఆలోచిస్తూ ఉన్నాడే ఎంత మంచి మనస్సున్నవాడు అని అనుకున్నాడు. ఇక రాజు విషయానికి వస్తే.. సింహాసనం కోల్పోయాను అని.. రాజ్య ప్రజలు ఎన్ని బాధపలు పడుతున్నారో అని రాజు చింతిస్తున్నాడు. ఇలా ఒకరి బాధలు ఒకరు తెలుసుకుంటూ వారు మార్కండేయ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. మార్కండేయ మహర్షి వారి బాధలను విని దీనికి కారణం విషయ పరిజ్ఞానం లేకుండా పోవడం, అమిత ప్రేమ, మంచి చెడులు తెలుసుకోలేకపోవడం అని గ్రహించాడు. 



-------------------------------------------------------------------------

అంతేకాదు మానవులు మాయా ప్రభావము చేత మమత అనే సుడిగుండములో పడి కొట్టుకుంటారని, దీని నుంచి బయట పడాలంటే దేవి అనుగ్రహం కావాలని అమ్మ అనుగ్రహం ఉంటే ఆ తరువాత ముక్తిని పొందవచ్చు అని వారికి చెప్పాడు.. మార్కండేయ మాటలు అన్ని జాగ్రత్తగా విన్నారు. మితి మీరిన అభిమానము, ప్రేమ అనురాగాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని సురథుడు, సమాధి అనుకున్నారు.

-------------------------------------------------------------------------

మహాముని వాక్యములను విని తపస్సు చేసుకోవడానికి కృష్ణానది ఉత్తర భాగాన వున్న అరణ్యాని కి వెళ్లారు. ఎలాగైనా పరమేశ్వరిని ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నారు. వైశ్యుడు, రాజు ఒక నది దగ్గర ఇసుక దిబ్బమీద కూర్చుని పరమేశ్వరీ గురించి తపస్సు చేయడం ప్రారంభించారు. స్వచ్ఛమౌన మట్టిని తీసుకుని దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారిరువురు పూలతో ధూ పముతో, అగ్ని, జలములతో దేవిని పూజిస్తున్నారు. తినకుండా, తాగకుండా ఏకాగ్రతతో బుద్ధి మనస్సులను దేవి యందు నిలిపి పరమేశ్వరిని వేడుకుంటున్నారు. శరీరానికి గాయాలు చేసుకు ని రక్త బిందువులతో బలులను సమర్పించిరి.

-------------------------------------------------------------------------

మూడు సంవత్సరములపాటు చండికను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. వారి తపస్సుకు మెచ్చి పరమేశ్వరీ ప్రత్యక్షం అయింది. ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది. రాజుమే వచ్చే జన్మలో శత్రు బాధలు లేని రాజ్యము కావాలి అని వరము కోరుకున్నాడు. వివేకం కలిగిన వైశ్యుడు జ్ఞానమును ప్రసాదించమని కోరుకున్నాడు. దేవీ కరుణా కటాక్షము వలన ఆ జన్మలోనే సురధునకు రాజ్యము ప్రాప్తించింది.. వైశ్య శేఖరునకు ఆత్మ సాక్షాత్కారము కలిగించు జ్ఞానము లభించింది.. భక్తులలు కోరిన కోరికలు ఆలస్యం కాకుండా వెంటనే ప్రసాదించే దేవి. పరమేశ్వరి 'దుర్గా నామముతో వెలసి వారి సేవలను పొందుతుంది..

-------------------------------------------------------------------------

ఆ తరువాత కొంత కాలానికి మాధవవర్మ రాజు ధర్మదీక్షకు పూనుకున్నాడు. సంతసించిన దుర్గ .. కనక వర్షము కురిపించి, లోకమును కరుణించింది. నాటినుండి పరమేశ్వరి "కనక దుర్గ' అని ప్రసిద్ధిగాంచింది. ఆమెయే విజయవాటికాధీశ్వరి కనక దుర్గ అమ్మవారు.

#VARAHI_TALKS

దుర్గముడు ఎవరు..? ఎలా పుట్టాడు. ఎలా సంహరించబడ్డాడు.

 దుర్గముడు ఎవరు..? ఎలా పుట్టాడు. ఎలా సంహరించబడ్డాడు.

-------------------------------------------------------------------------------------------------------

 దేవి నవరాత్రుల సందర్భంగా మన చానల్ నుంచి దుర్గాదేవి మహిములను అమ్మవారి విశిష్టతను వీడియలుగా అందిస్తున్నాము. ఇది 4వ భాగం వీడియో...

ఈ వీడియోలో దుర్గముడు ఎవరు..? ఎలా పుట్టాడు. ఎలా సంహరించబడ్డాడు. పరమేశ్వరి దుర్గాదేవిగా ఎలా మారింది. ఆ అవతారం వెనుక వున్న కథ ఏమిటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. 5వ భాగం వీడియో కూడా చూడాలి అనుకుంటే మన చానల్ని సబ్  చేయండి.

-------------------------------------------------------------------------------------------------------



కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యాక్షుడు అతడి వంశంలో రురుడు అనే దానవుడు పట్టాడు. అతని కుమారుడే దుర్గముడు. దుర్గముడు చాలా క్రూర స్వభావం కలవాడు. కఠినాత్ముడు. ఒక సారి దుర్గముడు తన మంత్రులతో కలిసి సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో దుర్గముడు మాట్లాడతూ దేవ దానవ యుద్ధం చాలా సార్లు జరిగింది. నిజం చెప్పాలంటే దేవతల కన్నా దానవులే భలవంతులు. యుద్ధ నైపుణ్యం దానవులకే ఉంది. అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు. దీనికి కారణం ఏమిటి..? అని సభలోని వారిని అడిగాడు. దీనికంతటికి కారణం వేదాలు. వేదోక్తంగా భూలోకంలోని బ్రాహ్మణులు హెూమాలు చేస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్నారు. వాటిలో హవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు. హావిర్భాగం ఇవ్వడంతో దేవతలకు బలం పెరుగుతుంది. 



-------------------------------------------------------------------------------------------------------

అందుకే దానవులు ఓడిపోతున్నారు. ఒకవేళ హవిర్భాగము గనుక దేవతలకు అందకపోతే, వారి బలం పెరగదు. అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు. యజ్ఞయాగాలు జరగాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలను లేకుండ చేస్తే బలం రాదు కదా..! ఈ రకంలో ఆలోచించి వేదాలను తన ఆధీనం చేసుకోవాలి అనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వతాలకు వెళ్లి బ్రహాదేవుని గురించి వేయి సంవత్సరాలు అత్యంత ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి, పట్టుదలకు మెచ్చి బ్రహ్మాదేవడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభూ నీ వద్ద ఉన్న వేదాలను నా వశం కావించు అన్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తూ అన్నాడు.

-------------------------------------------------------------------------------------------------------

వేదాలు దుర్గముడి ఆధీనంలోకి తక్షణమే వచ్చాయి. ఆ క్షణం నుంచి బ్రాహ్మణులు వేద ప్రవచనం చేయలేకపోయారు. వేదోక్త విధులు జరగడం లేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయాడు. దానివల్ల వర్షాలు కురవడం ఆగిపోయాయి. చెరువులు, బావులు ఎండిపోయాయి. పంట పొలాలకు నీరు లేదు. పంటలు పండటం లేదు. దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. హవిర్భాగాలు లేక దేవతలు వారి శక్తి నశించి తేజోహీనులు అయ్యారు. ఇదే అదునుగా తీసుకుని రాక్షసులు స్వర్గసీమ మీద దాడి చేశారు. దేవతలు కూడా తిరిగి యుద్ధం చేశారు. కాని వారికి శక్తి లేక దానవుల ఎదుట నిలబడలేకపోయారు. అక్కడి నుంచి అరణ్యాలకు పారిపోయారు.


 

-------------------------------------------------------------------------------------------------------

మిగిలిన ప్రజలంతా ఆ పరమేశ్వరిని వేడుకున్నారు. అమ్మా.. తిండి తిని ఎన్నో రోజులు అయింది. ఆకలితో మలమలమాడిపోతున్నాము. కొంత మంది చనిపోతున్నారు. బ్రతికున్న మేము వచ్చి నిన్ను ప్రార్ధిస్తున్నాము. కరుణించు మాతా... కరుణించు... దుర్గముడి వల్లనే మాకు ఈ దుస్థితి పట్టింది. మమ్మల్ని నీవే రక్షించాలి అని ప్రార్థించారు. అప్పుడు ఆమె వళ్లంతా కళ్లు చేసుకుని వారి బాధలు విన్నది. ఎంతైనా తల్లి మనస్సు కదా.. వారందరినీ చల్లగా చూసింది. అందుచేతనే శతాన్ని అని పిలవబడింది. ప్రజల బాధలు విన్న పరమేశ్వరి కూడా బాధపడింది. క్షణం ఆలస్యం చేయకుండా పరమేశ్వరి ప్రజలు తినడానికి పండ్లు, కూరలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అందుచేతనే ఆమె శాకంబరి అని అనబడింది. 

-------------------------------------------------------------------------------------------------------

ఇంద్రాది దేవతలు అరణ్యాలలోనూ, కొండ గుహాలలోనే దాక్కున్నారనే విషయం దుర్గముడికి తెలిసింది. దుర్గముడి సేన దేవతల మీదకు యుద్ధానికి వచ్చారు. రాక్షసుల దాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరిని అమ్మా శరణు.. శరణు అని వేడుకున్నారు.. వెంటనే ఆ తల్లి ఉగ్రరూపంతో పత్యక్షం అయింది. పరమేశ్వరికీ, రాక్షసులకు భీకరమైన యుద్ధం జరిగింది. దేవి ఒంటరిగా వచ్చిందని గ్రహించి రాక్షసవీరులు అనేక మంది ఆమెను చుట్టుముట్టారు. దేవితో యుద్ధానికి తల పడుతున్నారు. అప్పుడు పరమేశ్వరి ఉగ్రరూపం ధరించి.. ఆమె శరీరం నుంచి కాళి, తారిణి, బాల, భైరవి, బగళ, మాతంగి వంటి శక్తులతో పాటు ఇంకా అనేక శక్తులు ఉద్భవించాయి. అసురులకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కాని క్షణ కాలంలో అసురులను ఆ శక్తులు సంహరించాయి.

-------------------------------------------------------------------------------------------------------

ఈ పోరు పది రోజులు జరిగింది. ఇక పదకొండవ రోజున దుర్గముడు యుద్ధరంగానికి వచ్చాడు. పరమేశ్వరికీ, దుర్గముడికి భీకరమైన యుద్ధం జరిగింది. పరమేశ్వరి ఆ రాక్షసుడిపై పదిహేను బాణాలు ప్రయోగించింది. వాటిలో నాలుగు బాణాల వల్ల గుర్రాలు మరణించాయి. ఒక బాణంతో సారధి మరణించాడు. రెండు బాణాలతో దుర్గముడి కన్నులు ఊడిపోయాయి. రెండు బాణాతో అతని భుజాలు తెగిపోయాయి. ఒక బాణంతో రథం విరిగిపోయింది. ఐదు బాణాలతో రాక్షసుడు నెత్తురు కక్కుకుని మరణించాడు. ఈ రకంగా దుర్గముడి సంహరం జరిగింది. కాబట్టే దుర్గాదేవి. అని పిలవబడింది.

ఈ వీడియో మీకు నచ్చితే like Share చేయండి

#VARAHI_TALKS 


6, అక్టోబర్ 2021, బుధవారం

పది జన్మల పాపాలు తొలగించే

పది అవతారాలు ఇవే..

------------------------------------------------------------------------------------------------------------------

హిందువుల ప్రధాన పండుగలలో విజయ దశమి ఎంతో విశిష్టమైనది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిదేవిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా, చివరి మూడు రోజులు సరస్వతిదేవిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి భక్తులకు దర్శనమిస్తుంది.



–––––––––––––––––––––––––––––––––––––––––––––––––

మొదటి రోజు అమ్మవారి అలంకారం : శైలపుత్రి

నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూలాన్ని పట్టుకుని భక్తులకు దర్శనం ఇస్తారు. హిమవంతుని కుమార్తె అయిన అమ్మవారు శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులను కటాక్షిస్తోంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం : పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, కీర్తిని అందిస్తుంది.

---------------------------------------------------------------------------------------------------------------

రెండో రోజు అలంకారం :  బాలాత్రిపుర సుందరీ

రెండో రోజు పరాశక్తి అయిన అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి కుమారి పూజ చేస్తారు. త్రిశక్తి పారాయణం చేస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి.            సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.



---------------------------------------------------------------------------------------------------------------

మూడో రోజు అలంకారం :  గాయత్రీదేవి

వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం. మూడో రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో.. శంఖం, చక్రం, గద, అంకుశం వంటివి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం లభిస్తోంది గాయత్రీ మంత్ర జపం జపిస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం లభిస్తుంది. సకల బాధలు తీరి భక్తుల కోరికలు నెరవేరతాయి.

---------------------------------------------------------------------------------------------------------------

నాలుగో రోజు అలంకారం :  లలితాదేవి

త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ, సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి.

---------------------------------------------------------------------------------------------------------------

ఐదో రోజు అలంకారం : సరస్వతీదేవి

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా ఈ రోజు భక్తులు అమ్మావారిని అధిక సంఖ్యలో దర్శిస్తారు. జగన్మాత, చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.



---------------------------------------------------------------------------------------------------------------

ఆరో రోజు అలంకారం : అన్నపూర్ణాదేవి

ఆరో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది

---------------------------------------------------------------------------------------------------------------

ఏడో రోజు అలంకారం : మహాలక్ష్మీ

రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.

---------------------------------------------------------------------------------------------------------------

ఎనిమిదో రోజు అలంకారం : దుర్గాదేవి

దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాల్లో చెప్పబడింది. పంచ ప్రకతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను దర్శిస్తే శత్రువుల బాధులు తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజిస్తే మంచి పలితాలు కలుగుతాయి.

---------------------------------------------------------------------------------------------------------------

తొమ్మిదో రోజు అలంకారం : మహిషాసురమర్దినీ దేవి

నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.



---------------------------------------------------------------------------------------------------------------

పదో రోజు అలంకారం : రాజరాజేశ్వరీదేవి

శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి.

అమ్మవారి గురించి మూడో వీడియోతో మీ ముందుకు వస్తాను.

#varahi_talks

 

3, అక్టోబర్ 2021, ఆదివారం

durgamma charitra telugu

దుర్గమ్మ చరిత్ర 

----------------------------------------------------------------------------

దసరా ప్రత్యేక కథనం

----------------------------------------------------------------------------

దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వీడియోలుగా అందించడం జరుగుతుంది.

ఇది మొదటి భాగం. ఈ వీడియో చూసే ముందు కామెంట్ లో దేవి నామాన్ని రాయగలరు. ఇక వీడియోలోకి వెళదాం. పూర్వం కీలుడు అనే యక్షకుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు కృష్ణవేణిలో స్నానం చేసి నది ఉత్తర భాగానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ప్రాంతంలో రాక్షసుల బాధ ఎక్కువగా ఉండేది. చిత్రహింసలు పెట్టేవారు.


మునులు తపస్సును భంగం చేసేవారు. రాక్షసుల భాధ భరించలేక చివరికి కీలుడు ఘోర తపస్సు చేశాడు. పార్వతీ దేవి ప్రత్యక్షమయితే కీర్తించి ప్రసన్నం చేసుకున్నాడు. ఏం వరం కావాలో అడిగింది అమ్మవారు. అమ్మా.. రాక్షనులు పెట్టే బాధలు భరించలేకున్నాము ఎలాగైనా వారిని అంతం చేసి మమ్మల్ని కాపాడు అని వేడుకున్నాడు. రాక్షసులు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు కాబట్టి నా హృదయంలోనే నిలిచి ఉండమని కోరాడు. సరే ఉంటానని చెప్పింది అమ్మవారు. అయితే కీలుడిని పర్వతంగా మారి వేచి ఉండమని చెప్పింది. దానికి సరే అన్నాడు కీలుడు.

కృతయుగంలో రాక్షస సంహారం చేస్తాను. ఆ తరువాత నీ పర్వతం మీద నిలిచి ఉంటానని చెప్పింది. కీలుడు అమ్మవారి కోసం కిలాద్రిగా మారి ఎదురు చూస్తూ ఉన్నాడు. రాక్షస సంహారం అనంతరం అమ్మవారు శీలాద్రి పర్వతం మీద చెప్పిన మాట ప్రకారమే వెలిసింది. అయితే అమ్మవారిని సేవించడానికి ఇంద్రాది దేవతలు ప్రతిరోజు కిలాద్రిక వస్తూ ఉండేవారు. అందువలన ఇంద్రకీలాద్రి అని పిలవబడింది.


మహిషాసుర సంహారం : 

‌పూర్వ కాలంలో దనువు అనేవాడు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు రంభుడు, కరంభుడు ఈ ఇద్దరు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేస్తున్నారు. కరంభుడు నీటిలో మునిగి తపస్సు చేస్తున్నాడు. రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడేమే మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరించాడు. సోదరుడి మృతికి హతానుడైన రంభుడు తన తల నరుక్కుని వరమేశ్వరునికి అర్పించాలి అనుకున్నాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షం అయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. శంకరా.. నాకు పుత్ర సంతానం లేదు. కాబట్టి నువ్వే నాకు మూడు జన్మలలో పుత్రునిగా జన్మించాలి అని కోరాడు. అంతేకాదు. ఆ బిడ్డ వేద వేదాంగ విధుడు, కామరూపుడు, దీర్ఘష్యుమంతుడు, ముల్లోకాలను జయించే వాడు అయి ఉండాలి అన్నాడు. తదాస్తూ అన్నాడు పరమేశ్వరుడు.

----------------------------------------------------------------------------

రాక్షన స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతున్న సమయంలో ఒక మహాషిని చూసి దానితో బలవంతంగా కాపురం సాగించాడు. రంభుడికి ఇచ్చిన మాట ప్రకారం శివుడు రుద్రుని అంశతో ఆమె గర్భంలో ప్రవేశించాడు. నెలలు నిండిన తరువాత బిడ్డను కంటుంది. అతడే మహిషాసురుడు. అతను మహా బలవంతుడు. తన పిన తండ్రి చావుకు కారణమైన ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొందుతాడు. ముల్లోకాలను గజగజలాడిస్తాడు. గర్వముతో ఒక్కసారి మహిషాసురుడు. కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళతాడు.


స్త్రీ రూపం ధరించి మహార్షి శిష్యుడిని బాధిస్తాడు. ఇదంతా చూసిన మహార్షి స్త్రీ చేతిలోనే నీకు చావు ఉంటుంది. అని శపిస్తాడు. అయినా మహిషాసురుడు తన బుద్ధిని మార్చుకోక ముల్లోక వాసులందరినీ బాధిస్తుంటాడు. అప్పుడు దేవతలు అంతా కలిసి ఆది శక్తిని ప్రార్థిస్తారు. ఆ దేవి ఉగ్రఛండి అనే పేరిట ఉద్భంచి మహిషాసురుడ్ని సంహారిస్తుంది. ఇది మొదటి జన్మలో జరిగినది. తరువాత రెండవ జన్మలోను రంభునికే కుమారుడుగా పుడతాడు. తన దానవ నైజంతో దేవ తలను వీడిస్తుంటే ఆ దేవతల ప్రార్థనపై ఆది శక్తి భద్రకాళీ రూపలో అవతరించి మహిమని మట్టుబెబుతుంది. ఇది రెండవ జన్మ.

----------------------------------------------------------------------------

ఇక మూడవ జన్మలో ఈ మహిమడు ఘోర తపస్సు చేసి బ్రహ్మా మనవరాలును పొందుతాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు పీడిస్తూ హించిస్తాడు. ఆ మహిమనికి ఒకరోజు కలలో మహాకాళి తనను ఒడిచిపెట్టి తన తలను నరికి రక్తపాతం చేస్తున్నట్లు కల వస్తుంది. దీంతో భయపడిన మహిమడు భద్రకాళి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు దేవి: ప్రత్యక్షం అవుతుంది. తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రాసాదించమని కోరతాడు. ఒకవేళ మరణం వచ్చినా నీ చేతిలోనే మరణించాలి. యజ్ఞభాగాల్లో చోటివ్వాలి అంటాడు. అప్పుడు అమ్మవారు.. ఓ మహిషా నువ్వు రుద్రాంశ నందు. జన్మించినవాడవు. 

నాకు వాహనం కావడానికి బ్రహ్మా నిన్ను సృష్టించాడు. నువ్వు నా వాహనంగా వుండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిలో నిలిచివుంటావు. అని దేవి పలికింది. ఆ తరువాత మహిషారుడికి మళ్లీ గత మాయ కప్పడంతో మళ్లీ అనుర చేష్టలకు పూనుకుని మునులను పీడిస్తూ ఉంటాడు. దేవతల ప్రార్థనపై మరో శక్తి అయిన శ్రీ కనకదుర్గామాతగా రూపం ధరించి మహిషాసురుని సంహారిస్తుంది. ఇది మూడవ జన్మలో జరిగింది.


అర్జునుడి తపస్సు

ఇంద్రకీలాద్రిపై వెలిసింది అమ్మవారు. మహిషాసురమర్దిని అయిన అమ్మవారు కనక వర్ణంతో వెలుగుతున్న కారణంతో. కనక దుర్గ అయింది. పాండవ మధ్యముడు అయిన అర్జునుడు అరణ్యవాన సమయంలో తన అన్న ధర్మరాజు ఆజ్ఞ మీద ఇంద్రకీలాద్రికి వచ్చి ఇంద్రుని కొరకు తపస్సు చేశాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై శివమంత్రం ఉపదేశిస్తాడు. పాశుపతాస్త్రం కావాలంటే శివుడిని ప్రార్ధించమని వెళ్ళిపోతాడు. అలా అర్జునుడు మరోసారి తపస్సు చేస్తున్నప్పుడు, ఒకానొక రోజు అతి భయంకరమైన పెద్ద వంటి వచ్చి అర్జునుడి తపస్సుకి భంగం కలిగించింది. తపోభంగం అయిన అర్జునుడు దానిని వేటాడతాడు. కానీ అతి అతని బాణాల నుంచి చాలా చురుకుగా తప్పించుకుని పారిపోతుంది.

----------------------------------------------------------------------------

ఎట్టకేలకు గురి చూసి దాని మీదకు బాణం చేశాడు. వెంటనే దగ్గరికి వెళ్లి చూస్తే దానికి రెండు బాణలు గుచ్చుకుని ఉన్నాయి. అంతలో ఓ కోయదొర వచ్చి ఆ వంటిని తీసుకుని వెళ్లసాగాడు. అప్పుడు అర్జునుడు ఆ పందిని నేను సంహారించాను కాబట్టి అది నాది అన్నాడు. దానికి ఆ కోయదొర నవ్వాడు. దానికి కోపం వచ్చిన అర్జునుడు, అతనితో ఎవరు. గొప్ప తేల్చుకుందామని యుద్ధానికి దిగాడు. అర్జునుడు ఎన్ని బాణాలు చేసినా ఆ కోయదొరను ఏమీ చేయలేకపోయాయి. తన దివ్యాస్త్రారాలు అన్ని వృథా అయిన కారణంగా అర్జునుడు తన విల్లు తీసుకుని ఆ కోయరాజు తనమీద కొట్టబోయాడు. అప్పుడు ఆ కోయరాజు మాయమై పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. అర్జునుడిని చూసి నవ్వసాగాడు.

----------------------------------------------------------------------------

పరమశివుడితో యుద్ధం చేసిన కారణానికి అర్జునుడు సిగ్గుపడి బాధపడతాడు. తర్వాత శివుడిని స్తుతిస్తాడు. దానికి, సంతోషించిన శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చి దానిని అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించాలి. ముందు నిగ్రహం సాధించిన తరువాతే ఈ అస్త్రం వాడాలి. అని చెబుతాడు. అప్పుడే ఈ ఆస్తాలు లోక కల్యాణం కోరకు ఉపయోగపడతాయి అని చెబుతాడు. ఆ తరువాత మాయమౌతాడు. అర్జునుడికి వరాలు ఇచ్చింది మల్లేశ్వరస్వామి శక్తి అయిన కనక దుర్గ, ఇంద్రకీలాద్రి చేత కీలితం చేయబడ్డాడు. కాబట్టి అర్జునికి ఇంద్రకీలుడు అని కూడా పేరు వచ్చింది. అర్జునికి వున్న విజయనాయం వల్ల ఈ ప్రాంతానికి విజయపురి., విజయవాటిక, విజయవాడ అని పేర్లు. వచ్చాయి.

#varahi_talks

2, అక్టోబర్ 2021, శనివారం

Sri venkateswara swamy charitra in telugu

 గోవిందా అంటే అర్థం తెలుసా...!!

గోవిందా అనగానే.. ఏడుకొండలవాడా వెంకట రమణ గోవిందా.. గోవిందా.. అనే మాటప్రతి తెలుగువాడికి వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణలతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు.. గోవిందా.. అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే, గోకులం నాటి కథ తెలుసుకోవాలి.



గోకులంలోని ప్రజలంతా ఇంద్రుడిని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురవుతారు. తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తిపట్టుకుంటాడు కృష్ణుడు. అది చూసిన ఇంద్రుడి గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని క్షమాపణలు వేడుకునేందుకు వెళతాడు.

----------------------------------------------------------------------------------------------------------------

అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటిని రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా, ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూసుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని (అధిపతిని), కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అంటాడు. అప్పటి నుంచి కృష్ణుడు, గోవిందుడు అన్న నామంతో పూజలందుకున్నాడు.



గోవు.. ఇందా.. గోవిందా!

కలౌ వేంకట నాయక:" అన్నట్లు కలి యుగానికి ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ప్రమాణం గల కలియుగానికి ఆధి దైవం, శ్రీ వేంకటేశ్వర స్వామి తానుండవలసిన చోటు "సప్తగిరి "అని ఎంచుకొని, తిరుపతి ప్రాంతానికి వచ్చాడట! అక్కడ చిర కాలంగా, ఆశ్రమం ఏర్పరచుకొని, తపస్సు చేసుకుంటూ ఉన్న అగస్త్య మహర్షిని చూచి "ముని పుంగవా! నేను వేంకట నాయకుణ్ణి. ఈ కలియుగానికి అధిపతిని అందరికీ ఆరాధ్య దైవాన్ని ఈ "సప్తగిరి "మీద నివసిద్దామని వచ్చాను. రోజూ క్షీర సేవనం చెయ్యడానికి, నాకు ఒక గోవునిస్తావా అని అడిగాడు.

----------------------------------------------------------------------------------------------------------------

ఋషి ఆ మాటలు విని పులకించి పోయాడు "ఓహో ! ఏమి నా భాగ్యం? సాక్షాత్తూ, వేంకటేశ్వర స్వామియే ! వచ్చి నన్ను! గోవునిమ్మని అడగ వచ్చాడా? అని ఆనందించాడు. ఆశ్రమంలో ఉన్న గోవులు మేత కోసం, అడవిలోకి వెళ్ళడంతో, అగస్త్యుడు చేతులు జోడించి స్వామీ! అలాగే! నీకు గోవును తప్పకుండా ఇస్తాను. నీవు నివసించే స్థలం " ఫలానా "అని ఎంచుకున్నావే! కానీ ఇంకా రాలేదు కదా! మా అమ్మతో, కూడా కలసి వచ్చిన నాడే నీవు గోవును ఇస్తాను" అన్నాడు.

అందుకు ఆనందించిన స్వామి, అలాగే అని అంతర్ధానం అయ్యాడు. కొన్నాళ్ళకి, లోక మాత అయిన లక్ష్మీదేవితో కలిసి స్థిర నివాసం ఏర్పరచుకోటానికి వచ్చాడు.. అప్పుడు మళ్ళీ అగమ్యడి ఆశ్రమానికి వెళ్లాడు స్వామి. అప్పుడు అగస్త్యఋషి అక్కడ లేదు.



----------------------------------------------------------------------------------------------------------------

శిష్యుడెవరో ఉంటే గతంలో జరిగిన సంభాషణ అతనికి స్వామివారు చెప్పారు. అతను "అలాగే! స్వామీ! మా గురువుగారెక్కడికో వెళ్ళారు. రాగానే చెబుతానన్నాడు. స్వామి వెనుదిరిగాడో లేదో! ఆగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వెంటనే శిష్యుడు గోపు విషయం చెప్పి "అడుగో స్వామి!" అని అటుగా చూపించాడు "అలాగా! దేవ దేవుడు నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకపోవడం ఎంత దురదృష్టం! " అని మదిలో నొచ్చుకుంటూ, పాకలో ఉన్న గోవు నౌకదానిని కట్టు విప్పి, గబగబా. వేకటేశ్వరుని వెంటబడి, గోవు ఇందా అని కేకలు వేసుకుంటూ, వెనకాలే వెళ్ళాడు.

'ఇందా అంటే "ఇదిగో తీసుకో!" అని అర్ధం కాబట్టి మునీంద్రుడు ఎలుగెత్తి గోవు ఇందా.. గోవు ఇందా.. గోవిందాగా అని అరుస్తూ వెంటబడి వెళుతూనే ఉన్నాడు. శిఖరాగ్రానికి చేరే సరికి నూటెనిమిది సార్లు ముని "గోవు ఇందా.. గోవిందా !" అని కేకలు వేశాడు.

----------------------------------------------------------------------------------------------------------------

అప్పుడు స్వామి వెనుదిరిగి చూసి "మునీంద్రా! గో... విధిగో! తీసుకో! అనే అర్థంలోనే అన్నావు. అయినా నన్ను నీవు "గోవిందా గోవిందా అని నూటెనిమిది సార్లు అన్నావు కాబట్టి గోవిందుడనేది. నా నామాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది "నాకీ గోవిందనామం ఎంతో ప్రీతి పాత్రమయింది. నీలాగే ఈ కొండనెక్కే నా భక్తులు, నన్నుద్దేశించి "గోవిందా ! గోవిందా! "అని నూటెనిమిది సార్లు పలికితే వాళ్ళకి! మోక్షమిస్తాను " అని వాగ్దానం చేసి అగస్త్యుడిచ్చిన గోవును ఆప్యాయంగా! స్వీకరించాడు.


 

----------------------------------------------------------------------------------------------------------------

కనుకనే, ఏడుకొండల స్వామిని దర్శించే భక్తులు "ఏడు కొండల వాడా! వెంకట రమణా! గోవిందా! గోవిందా! అడుగు దండాల వాడా! గోవిందా! గోవిందా! ఆపద మ్రొక్కుల వాడా! గోవిందా గోవిందా! అని నోరారా పిల్చుకుంటూ, స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు భక్తులు. గోవింద నామ స్మరణం చేస్తేనే! ఆ స్వామికి! ప్రీతి కదా! సహస్ర నామాలున్నా! ఆ వేంకటేశ్వర స్వామిని ఇలా! "గోవిందా గోవిందా అనే గోవింద నామార్చనతో పిలుస్తూ నేటికీ భక్తులు తరిస్తున్నారు!!!

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...