25, అక్టోబర్ 2022, మంగళవారం

 ఎటువంటి కారణాల వల్ల తులసి వాడిపోతుంది..? 


మట్టిలో దోషం ఉన్నా ఎండ సరిగ్గా తగలకపోయినా నిర్దిష్ట సమయానికి నీరు పోయకపోయినా వాడిపోతుంది. 

బహిష్టు మైల సమయాలలో తులసి దగ్గరకు వెళ్ళినా తులసిని తాకినా తులసి వాడిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు బాధపడుతున్న, హింసకు గురవుతున్న ఇంట్లో తులసి వాడిపోతుంది. ఉతికిన బట్టలు ఆరవేసిన నీరు తులసికి తగిలినా, తులసి ఉండే కుండీలో వేరే మొక్కలు పెరిగిన తులసి వాడిపోతుంది. 




హనుమంతుడి విగ్రహాన్ని స్త్రీలు తాకవచ్చా..? 


హనుమంతుడి విగ్రహన్నే కాదు దేవాలయాలలోని ఏ దేవతా విగ్రహన్నైనా స్త్రీలు, పురుషులు ఎవరూ తాకకూడడు. దేవాలయంలో అర్చకులు తప్ప ఎవరూ విగ్రహాన్ని తాకకూడడు. దేవాలయ అర్చకులు కూడా దేవుని విగ్రహాన్ని అర్చన చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడూ విగ్రహాన్ని తాకకూడదు. 


వాడిపోయిన తులసి మొక్కను ఏం చేయాలి.


వాడిపోయిన తులసి మొక్కను ఎండబెట్టి చుట్టుపక్కల ఏమైనా యజ్ఞాలు, హోమాలు జరుగుతుంటే అక్కడ ఆ అగ్నిలో వేయవచ్చు. లేదా మొక్క మరీ పెద్దగా ఉంటే తులసి పూసలు చేసుకుని తులసిమాల చేసుకోవచ్చు. లేదా ప్రవహిస్తున్న జలాశయాలలో నీటిలోగాని నదులలో గాని వదలవచ్చు. లేదా ఎవరూ ముట్టుకోని చోట ఎవరూ తిరగని చోట వేయవచ్చు. పందులు తిరిగేచోట, పెంటకుప్పలపైనా వేయకూడదు.



ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదా..

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు, పచ్చిమం వైపు తలపెట్టి నిద్రించకూడదు అని మార్కండేయ పురాణంలోని మదాలస కథ ద్వారా తెలుస్తుంది. మదాలస అలర్కడు అనే తన కొడుకుకి సదాచారాలు చెప్తూ ఇలా అంటుంది

" కుమారా నిద్రించేటప్పుడు తల తూర్పు దిక్కున గాని, దక్షిణ దిక్కుకు గాని పెట్టి నిద్రించు. ఎటువంటి పరిస్థితులలోనూ పడమర వైపు గాని ఉత్తరం వైపు గాని తల పెట్టి నిద్రించకు. అలా నిద్రిస్తే నీకు కీడు కలుగుతుంది.

కాబట్టి పడుకునేటప్పుడు తల తూర్పు లేదా దక్షిణ దిశగా పెట్టి నిద్రపోవాలి.

(ఈ మధ్య కొందరు సొంత ఊరిలో ఒక దిక్కున తల పెట్టి పడుకోవాలి, వేరే ఊరిలో ఉంటే వేరే దిక్కుకు తల పెట్టాలి అని జనాలను అయోమయంలో పడేస్తున్నారు. కానీ దానికి ఎటువంటి శాస్త్ర పురాణ ఆధారాలు లేవు.) ఈ విషయాలు మార్కండేయ పురాణంలోనివి. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...