17, జులై 2022, ఆదివారం

అది 1940వ సంవత్సరంలో జ‌రిగిన క‌థ ఇది

అది 1940వ సంవత్సరంలో జ‌రిగిన క‌థ ఇది

అది 1940వ సంవత్సరం. ఒక వ్యక్తి మహా పెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు... శివ్యులను అగిడితే స్వామి ధ్యానంలో ఉన్నారు కూర్చొండి అన్నారు. అతని చేతిలో ఒక టేప్ రికార్డర్ ఉంది. అది చూసి అందరూ ఆశ్యర్యపోయారు. కొంత సేపటి తరువాత స్వామి బయటికి వచ్చారు. శిష్యులు అతని గురించి చెప్పి స్వామి వద్దకు పంపించారు.


స్వామి నమస్కారం.. మిమ్మల్ని ఇంజర్య్వూ చేయడానికి వచ్చాను.. టేపిరికార్డర్ పట్టుకుని అడిగాడు. / అలాగే అని కూర్చున్నారు మహాస్వామి../ ఇటర్య్వూ అనగానే అక్కడ ఉన్న వారందరూ వచ్చి చుట్టూ కూర్చున్నారు. ఆ వ్యక్తి మహా స్వామిని ఏదో అడగబోతుంటే / వెంటనే స్వామి ఇలా అన్నాడు.. / నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగాడు... / టేప్ రికార్డర్ స్వామి అన్నాడు.. / అవునా... ప్రపంచంలో అతి పురాతనమైన టేప్ రికార్డర్ ఏమిటో తెలుసా.. అన్నాడు.. / అతని నోటి వెంట మాట రాలేదు.. / వెంటనే మరో ప్రశ్న విష్ణు సహస్రనామం / మనకు ఎలా వచ్చింది అని అడిగారు. / అతనికి తెలియదు.. కాని శిష్యులలో ఒకతను టక్కున లేచి భీష్ముడు భోధించాడు స్వామి అన్నాడు.. / మరి భీష్ముడు భోధిస్తే ఎవరు వ్రాశారు అన్నారు మహాస్వామి.. / టక్కున కూర్చున్నాడు లేచినవాడు. అక్కడ వున్న అందరూ మహా స్వామి వైపు అమాయకంగా చూశారు. '


నాయనలారా... విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా గొప్పది... దాని గురించి పూర్తి వివరంగా చెబుతాను వినండి... అని మహా స్వామి చెప్పడం మొదలు పెట్టారు.. కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసిన తర్వాత / భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. / సుమారు నెలరోజులు తర్వాత / ఒకనాడు పాండవులతో మాట్లాడుతూ / శ్రీకృష్ణుడు హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు. / కాసేపు మౌనంగా నిల్చున్నాడు... / కంగారు పడిన పాండవులు కృష్ణా.. కృష్ణా... ఏమైంది అని కృష్ణుడిని అడిగారు. అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ముడు / నన్ను స్మరించుకుంటున్నాడు... అందుకే నా మనస్సు అక్కడికి మళ్లింది. / పాండవులారా వెంటనే బయలుదేరండి / అక్కడకు వెళ్లాలి. అన్నాడు కృష్ణుడు.. / భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోసన పట్టినవాడు అని చెప్పి పాండవులను వెంటబెట్టుకుని / భీష్ముని వద్దకు పరుగున వెళ్లారు.


కృష్ణుడిని చూడగానే భీష్ముడు ఎంతో సంతోషించాడు.. / కృష్ణా వచ్చావా.. అంటూ / అంపశయ మీద నుంచే ఆప్యాయంగా పలకరించాడు. / నాయనా ధర్మరాజా.. నీకు విష్ణు సహస్రనామాన్ని భోధిస్తాను శ్రద్ధగా విను.. / ఈ స్తోత్రం ఎవరైతే పారాయణం చేస్తారో / వారి కోరికలు తీరి విజయం వరిస్తుంది నాయనా ! అంటూ విష్ణు సహస్ర నామాలను కృష్ణుడి వైపు చూసి భోధించడం ప్రారంభించాడు. సహస్రనామాలు అంటే వేయి నామాలు.. / ఒక్కొక్క నామం కీర్తిస్తూ ఉంటే కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అందరూ అత్యంత శ్రద్ధగా వింటున్నారు. చివరికి వేయి నామాలను పూర్తి చేసి తన బాధ్యతను పూర్తి చేశాడు భీష్ముడు.. / భీష్ముడు చెబుతుంటే అందరూ విన్నారేగాని ఎవరకూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడు "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము / కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా  కృష్ణా" అని అడిగాడు. / అవును కృష్ణా ఈ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు. / అప్పుడు శ్రీ కృష్ణుడు విష్ణు సహస్రనామాలను లికించాలంటే / సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది అన్నాడు.


“అదేలా” అని అందరూ ఆశ్యర్యంగా అడిగారు. / శ్రీ కృష్ణుడు ఇలా చెప్పాడు..! మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేక ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే / ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి మళ్లీ వినవచ్చు/ అప్పుడు వ్యాస మహర్షితో వ్రాయించవచ్చు / అని కృష్ణుడు సలహా ఇచ్చాడు. / శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు,/ ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోటు/ అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చున్నారు. / సహాదేవుడు స్పటికాన్ని పట్టుకుని శివుడిని ప్రార్థిస్తున్నాడు / అప్పుడు భీష్ముడు చెప్పిన మాటలు / మళ్లీ ఆ స్పటికం నుంచి వినిపిస్తున్నాయి. వాటిని శ్రద్ధగా విని వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు. / ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం అయింది. / అని శ్రీశ్రీశ్రీ మహా పెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అందరికీ వివరంగా చెప్పారు. వచ్చిన వ్యక్తి కూడా టేప్ రికార్డుల్లో స్వామి మాటలను రికార్డు చేసుకుని వెళ్లాడు.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...