28, సెప్టెంబర్ 2021, మంగళవారం

dharmapuri yama dharmaraja temple

 భారతదేశంలో ఎన్నో వింత ఆలయాలు ఉన్నాయి. మరెన్నో గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఎంతో మహిమ కలిగిన ఆలయం. మన తెలుగు రాష్ట్రంలోనే ఒక గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుంది. అందరికీ తెలియకపోవచ్చు కాని చాలా మంది నరక బాధలు తప్పుతాయని వెతుక్కుంటూ ఈ ఆలయానికి వెళతారు. ఇక్కడ నది ఉంది. అందులో మునిగితే చేసిన పాపాలు తొలగిపోతాయి. నరక బాధలు ఉండవని చెబుతారు. యమధర్మరాజు శాంతిస్తాడు. నరకం నుంచి దారి మళ్లిస్తాడు. స్వర్గానికి పంపిస్తాడు. ఇలా ఎన్నో విషయాలు భక్తులు చెబుతుంటారు. ఎందుకంటే ఇక్కడ యమధర్మరాజు గుడి ఉంది. అందుకే ఇంత ప్రత్యేకం ఈ ఆలయం.



ఆ క్షేత్రం ఏమిటి.... ఎక్కడ ఉంది.... ఆ ఆలయానికి అంత విశిష్టత రావడానికి కారణం ఏమిటి.... ఆ ఆ నది గురించి కథ ఏమిటి.. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం...

వివరళ్లు తొక్కుతూ ప్రవహించే గోదావరి నది. ఆ నది ఒడ్డునే శ్రీలక్ష్మీ నరసింహ స్వామి గుడి. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా పూలజందుకుంటుంది. ఈ ఆలయానికి అనేక పేర్లు ఉన్నాయి. దక్షిణ కాశీ, తీర్థరాజం, హరిహర క్షేత్రం వంటి పేరులతో విరాజిల్లుతుంది. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. త్రిమూర్తులు వెలసిన క్షేత్త్రం.. వనవాస సమయంలో శ్రీ రాముడే ఈ క్షేత్రాన్ని దర్శించి శివలింగాన్ని ప్రతిష్టించాడు.

---------------------------------------------------------------------------------------------------------------------

ఇక్కడ పూజలందుకునేది రామలింగేశ్వరుడు. లింగరూపుడు. ఈ క్షేత్రంలో నారసింహుడు కోరమీసంతో రెండు రూపాల్లో దర్శనమిస్తాడు. ఒకటి ఉగ్రరూపం అయితే రెండవది ప్రశాంత వదనం..

---------------------------------------------------------------------------------------------------------------------


పిండధానాలకు ప్రసిద్ధి :


దక్షిణ కాశీగా పేరు వున్న ఈ ఆలయం కర్మలకు కూడా ప్రసిద్ధి. ప్రక్కనే ఉన్న గోదావరి నది వద్ద పితృదేవతలకు పిండ ప్రధానాలు చేస్తారు. కాశీకి వెళ్లలేని వారు మన తెలుగు రాష్ట్రంలోని ఈ క్షేత్రానికి వెళతారు. క్రీస్తుపూర్వం 850-928కి ముందే ఈ ఆలయం ఉందని పరిశోధనకులు చెబుతున్నారు. మహిమగల ఈ క్షేత్రం కరీంనగర్ జి ల్లాలోని ధర్మపురి పట్టణంలో భక్తులకు దర్శనం ఇస్తోంది.

---------------------------------------------------------------------------------------------------------------------

మొగలులు ఆక్రమించిన ఆలయం

మొగలుల దండయాత్రలో భారతదేశంలో ఎన్నో ఆలయాలు ధ్వసం అయిన సంగతి మనందరికీ తెలుసు. అందులో ఈ ఆలయం కూడా ఉంది. నరసింహ స్వామి దేవాలయాన్ని అప్పటి హైదరాబాద్ సుల్తాన్ అయిన సుబేదార్ రుస్తుండీల్ ఖాన్ ఔరంగజేబు మద్దతుతో ఆలయాన్ని మసీదుగా మార్చాడు. తరువాత అంటే 1448లో మళ్లీ ఆలయంగా నిర్మించబడింది. నిత్యం పూజందుకుంది. ఇది ఆ నరసింహస్వామి మహిమేనని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

---------------------------------------------------------------------------------------------------------------------

స్థలపురాణం:
ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీ.శ.1422-33 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తోంది.

---------------------------------------------------------------------------------------------------------------------

నది మహాత్యం :
పూర్వం సత్యవతి, మేరునిధి అనే దండతులు ఉండేవారు. ఓ ముని ఇచ్చిన శాపం కారణంతో మేరునిధి పాము రూపం పొందాడు. దిగులు చెందిన అతని భార్య ఎన్నో గుళ్లూగోపురాలూ తిరిగింది. అయినా ఫలితం కనిపించలేదు. చివరికి ధర్మపురికి వచ్చి నృసింహస్వామిని దర్శించుకుందట. గోదావరిలో స్నానం ఆచరించగానే సత్యవతీదేవి భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం తెలుపుతోంది. అందువల్లే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదన్న నానుడి వచ్చిందని స్థానికుల విశ్వాసం.



వేదాలకు, సంస్కృతికి ప్రసిద్ధి ఈ ఆలయం :

చారిత్రకంగానూ ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. ధర్మపురి పట్టణం వేదాలకూ, ప్రాచీన సంస్కృతికీ, సంగీత సాహిత్యాలకూ పుట్టినిల్లుగా పేరుగాంచింది. ఇక్కడ బ్రహ్మపుష్కరిణితోపాటు సత్యవతీ ఆలయం (ఇసుక స్తంభం) ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శిస్తే మానసిక, శారీరక బాధల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం. నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం.

---------------------------------------------------------------------------------------------------------------------


ఆలయంలో దేవుళ్లు :
ఈ ఆలయంలో అనేక మంది దేవుని విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఎనిమిది హనుమంతుడి విగ్రహాలు మరియు ఆరు అడుగుల ఎత్తున్న బ్రహ్మ విగ్రహం. యమ, కృష్ణుడు విగ్రహాలు కూడా చూడదగినవి. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి యోగా ముద్రలో ఉంటాడు. అరచేతులను మోకాళ్లపై ఉంచి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు... ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా పక్కనే ఉంటుంది. ఇలాంటి యోగ ముద్ర రూపం అరుదుగా కనిపిస్తోందని చెబుతారు. స్వామివారి విగ్రహం మొత్తం సాలగ్రామ శిలతోనే తయారైంది. విగ్రహం చుట్టూ దశావతారాలు సుందరంగా కనిపిస్తుంటాయి. ప్రశాంత చిత్తంతో స్వామివారిని తలచినంతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.



---------------------------------------------------------------------------------------------------------------------


యమధర్మరాజు గుడి :
దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు గుడి ఉంది. ఈ కారణంగానే 'ధర్మపురికి వస్తే యమపురి ఉండదనే నానుడి ప్రసిద్ధి చెందింది. ఒకసారి స్వామివారిని దర్శించుకోవాలని యమధర్మరాజు వచ్చాడంట... స్వామివారు అప్పుడు గోదావరి నదిలో స్నానం చేసి రమ్మని చెప్పారు. అలాగే చేశాడు యమధర్మరాజు రావడం అయితే వచ్చాడు కానీ స్వామివారు యమధర్మరాజుని పంపించలేదట. అక్కడే ఉండమని చెప్పారట. నా భక్తులు వస్తారు. వారికి సరక భాధలు తప్పించు... స్వర్గానికి దారి చూపించు అని అన్నాడట.. అందుకే ఇక్కడ యమధర్మరాజు కొలువై స్వామివారి భక్తులను గుర్తు పెట్టుకుంటాడు.

---------------------------------------------------------------------------------------------------------------------

బ్రహ్మాత్సవాలు :
ఈ ఆలయంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు.
ఎక్కడా లేని విధంగా త్రిమూర్తులు మరియు యమధర్మరాజు కొలువైన ఆలయం ఇది ఒక్కటి కావడం విశేషం.. మరో ప్రాచీన ఆలయం గురించి తెలుసుకుందాం... ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తరువాత విడియో కూడా చూడాలి అనుకుంటే సబైబ్ చేయండి.

#varahitalks

27, సెప్టెంబర్ 2021, సోమవారం

RAMAPPA TEMPLE HISTORY TELUGU

రామప్ప దేవాలయం...

------------------------------------------------------------------------------------------------------------

రామప్ప దేవాలయం.. ముందుగా ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం... ఈ ఆలయాన్ని నిర్మించింది రేచర్ల రుద్రుడు. ఇతడు గణపతి దేవ సైన్యాధిపతి. కానీ ఈ ఆలయ శిల్పి మాత్రం కర్ణాటకాకు రామప్ప. ఇతడిని స్తపతి అంటారు. రామప్ప చెక్కిన ఈ ఆలయానికి అతని పేరుమీదే రామప్ప దేవాలయం అని పిలవబడింది. శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని వెలుగొందుతుంది. 

-------------------------------------------------------------------------------------------------------------

దక్షిణ భారతంలో ఆలయాన్ని చెక్కిన శిల్పిపేరు మీద వున్న ఒకే ఒక్క ఆలయం ఇదే కావడం విశేషం. కాకతీయ రాజుల కళానైపుణ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం.. కాకతీయుల కాలంలో కి.శ. 1213లో ఈ ఆలయం నిర్మించబడింది. తెలంగాణాలోని గొప్ప ఆలయాల్లో ఇది ఒకటి. దీనినే రామలింగుశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని విశ్వబ్రహ్మాణుల ఆధ్వర్యంలో గొప్ప శిల్ప నైపుణ్యంతో తీర్చిదిద్దబడింది. కాకతీయుల కాలంలో చెరువులు తవ్వించడం అనేది ఎక్కువగా జరిగేది. అందులో భాగంగానే ఈ దేవాలయం పక్కనే ఒక సరస్సును నిర్మించారు. 



-------------------------------------------------------------------------------------------------------------

నేటికీ ఎన్నో ఊళ్లకు సాగు నీరు అందిస్తున్నది. ఈ దేవాలయం ఉన్న ఊరిపేరు పాలంపేట ఇది ఇప్పటిది కాదు 13 నుంచి 14 శతాబ్ధాల మధ్య ఎంతో వైభవంగా వెలుగొందింది. ఈ దేవాలయం నిర్మాణ సమయంలో కాకతీయ రాజు ఒక శిలాశాసనం వేయించాడు. అందులో స్పష్టంగా చెప్పబడింది. ఈ ఆలయానికి ఇంతటి గొప్ప రూపునిచ్చింది గణపతిదేవ సైన్యాధిపతి రేచ్చర్ల రుద్రయ్య, మరియు ఆలయానికి పని చేసిన వారి వివరాలు శాసనంలో ఉన్నాయి.

-------------------------------------------------------------------------------------------------------------

ఈ ఆలయ ప్రత్యేకతలు

1. ఇసుకపై ఆలయ నిర్మాణం చేయడం

2. ఆలయ నిర్మాణానికి వాడిన రాయి నేటికీ రంగు కోల్పోకుండా ఉండటం.

3. నీటిలో తేలియాడే ఇసుకలతో ఆలయ నిర్మాణం చేయడం

4. అద్భుత శిల్పకళా నైపుణ్యం

---------------------------------------------------------------------------------------------------------

ఈ దేవాలయంలో ప్రధాన ధైవం రామలింగేశ్వరుడు. విష్ణువు అవతారం రాముడుగా ఈ ఆలయంలో దర్శనం ఇస్తున్నాడు.  ఈ ఆలయం కాకతీయ రాజుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాయితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉండి ఎంతో సుందరంగా ఉంటుంది. 


 

-------------------------------------------------------------------------------------------------------------

ఈ ఆలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించబడింది. ఇక్కడి ఆలయానికి ఎదరుగా ఉన్న నందికి ఒక ప్రత్యేక ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తిపట్టుకుని ఎప్పుడు ఆ శివుడు పిలుస్తాడా పరుగున వెళదాము అన్నట్లు  ఉంటుంది. నందికి ముందు భాగాన నిలబడి ఎక్కడి నుంచి చూసినా మనల్నే గమనిస్తున్నట్లు ఉంటుంది. 

-------------------------------------------------------------------------------------------------------------

1213లో నిర్మించిన ఈ ఆలయంలో సుమారు 110 సంవత్సరాల పాటు ధూపధీప నైవేధ్యాలతో ఎంతో శోభాయమానంగా వెలుగొందింది. తరువాతి కాలంలో ముస్లీంల ఆదిపత్యం మొదలవడంతో కాకతీయ సామ్రాజ్యం అంతం అయింది. ముస్లీంల పాలన మొదలైంది. వారి కాలంలో సుమారు 550 సవంత్సరాల పాటు ఆ దేవాలయానికి పూజలు లేకుండా ఆలయం చీకటిగా మారి అధ్వాన్న దశలోకి వెళ్లింది. ఒకరోజు ముస్లీంల సామంత రాజు అయిన అసీఫ్‌ జహీల్‌ అనే రాజు వేటకు వెళ్లాడు. అతనికి ఈ గుడి కనిపించింది. అక్కడ అధ్వాన్నంగా ఉన్న రాతి స్తంభాలను చూసి చలించిపోయాడు. సిమెంట్‌తో వాటిని మళ్లీ అతికించి తిరిగి నిలబెట్టాడు. ఆలయ పరిసరాలను శుభ్రం చేయించి మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చాడు. అలా రెండవ సారి వెలుగులోకి వచ్చింది. 

-------------------------------------------------------------------------------------------------------------

ఈ ఆలయం. మళ్లీ 1951వ సంవత్సరంలో పురావస్తు శాఖ వారు ఆధీనంలోకి తీసుకుని సంరక్షించడం మొదలుపెట్టారు. ఇప్పుడు  ప్రపంచ వారసత్వ సంపద జబితాలోకి చేరింది. యూనెన్కో జాబితాలో చేరి ప్రపంచ వారసత్వ హోదా పొందింది. 

-------------------------------------------------------------------------------------------------------------

రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పాలంపేట అనే గ్రామంలో ఉంది. 

#varahitalks

who prepared food during kurukshetra

  కురుక్షేత్ర యుద్ధంలో వంట చేసింది ఎవరో తెలుసా..


యుద్ధం జరిగే సమయంలో సైనికులు పోరాడాలి. పోరాడాలి అంటే శక్తి కావాలి. అందుకు ఆహారం తీసుకోవాలి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో సేనలకు ఆహారం అందించింది ఎవరు..?. అసలు ఉడిపి రాజు ఏం చేశాడు... అతడు ఎందుకు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి పక్షాన పోరాడలేదు. క్రష్ణుడిని వద్దకు వెళ్లి ఏమని అడిగాడు. ఉడిపి రాజు కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఏం చేశాడో చివరి వరకు చూడండి.   

సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం పాండవులు మరియు కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం భీకరంగా జరిగింది. ఒకవైపు పాండవులు మరో వైపు కౌరవులు, రెండు సేవను యుద్ధానికి సిద్ధంగా వున్నాయి. ఇతర రాజులు కొంత మంది పాండవుల పక్షాన, కొంత మంది కౌరవుల పక్షాన నిల్చుని పోరాటానికి సిద్ధంగా వున్నారు. ఈ యుద్ధంలో వందలాది రాజులు పాల్గొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన పక్షాన వారు నిలబడి కౌరవులకో, లేదా పాండవులకో మద్ధతు ఇస్తున్నారు. కానీ ఒక రాజు మాత్రం ఎవరి పక్షాన నిలబడకుండా తటస్థంగా వున్నాడు. అతడే ఉడిపి రాజు. అతనికి ఎవరి పక్షాన నిలబడి యుద్ధం చేయడం ఇష్టం లేదు. 



-------------------------------------------------------------------------------------------------

అందుకే శ్రీక్రుష్ణుని వద్దకు వెళ్లి స్వామి నేను ఎవరి పక్షాన యుద్ధంలో పాల్గొననను. కానీ రెండు సేనలకు మాత్రం ఆహారం అందిస్తాను. అని అడిగాడు. దీనికి శ్రీక్రిష్ణుడు సరే ఉడిపి రాజా రెండు సేనలకు ఎలాగూ ఆహారం అవసరమే కదా.. వారికి వంట చేసి వడ్డించండి. అని చెప్పాడు. యుద్ధానికి రెండు సేనలు కలిపి 5 లక్షల మంది సైనికులు వచ్చారు. అని ఆ రాజుకు చెప్పాడు. యుద్ధం 18 రోజుల పాటు కొనసాగింది. ప్రతీరోజు వేలాది మంది సైనికులు చనిపోతున్నారు. కాబట్టి ఆహారం తక్కువ చేసి వండాలి. అతను 5లక్షల మందికీ వంట చేయకూడదు. అలా చేస్తే ఆహారం వ్రధా అవుతుంది. అలాగని ఎక్కువ వండితే అది పాడైపోతుంది. ఉడిపి రాజు ఒక్క మెతుకును కూడా వ్రధా చేయకుండా చాలా చక్కగా ఎంతో జాగ్రత్తగా నిర్వహించేవాడు. 

-------------------------------------------------------------------------------------------------

ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు వేల మంది చనిపోతున్నా ఆహారం మాత్రం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపోతుంది. రోజూ యుద్ధం ఎంతో మంది చనిపోయినా సరే మిగిలి వున్న వారికి çసరిగ్గా ఆహారం సరిపోతుంది. కొన్ని రోజుల తరువాత సైనికులకు మరియు ఇతర రాజులకు ఆశ్యర్యం వేసింది. అతను సరిపడా ఆహారం ఎలా వండగలుగుతున్నాడు అని.. యుద్ధంలో ఎంత మంది చనిపోతున్నారో ఎవరికీ తెలియదు. ఉదయం లేచి మళ్లీ యుద్ధం చేయాలి. కాబట్టి ఎంత మంది ఉన్నారు. ఎంత మంది మరణించారు. అనే విషయాలు మీకు ఎలా తెలుసున్నాయి. వారికే సరిపడా ఆహారం ఎలా వండగలుగుతున్నారు. అని చాలా మంది ఉడిపి రాజును అడిగారు. 

-------------------------------------------------------------------------------------------------

దీనికి సమాధానంగా ఉడిపి రాజు ఇలా అన్నాడు. ప్రతిరోజు రాత్రి నేను క్రుష్ణుడి గుడారానికి వెళ్తాను. శ్రీ క్రష్ణుడు రాత్రిపూజ వేరుశనగలు తినడానికి ఇష్టపడడు. కాబట్టి నేను వాటిని ఒలిచి ఒక గిన్నెలో ఉంచుతాను. అతను కొన్ని వేరు శనగలను తింటాను. మరియు వాటిని తిన్న తరువాత ఎన్ని తిన్నాడో నేను లెక్కబెడతాను. క్రష్ణుడు 10 వేరుశనగలు తింటే రేపు యుద్ధంలో 10 వేల మంది చనిపోతారని తెలుసుకున్నాను. కాబట్టి ఎంత మంది జీవించి ఉండారో అంచనా వేసి వారికి మాత్రమే భోజనాలు సిద్ధం చేస్తాను. అది సరిగ్గా అందరికి సరిపోతుంది. అని వారికి చెప్పాడు. 

-------------------------------------------------------------------------------------------------

అందుకే ఇప్పటీ చాలా మంది ఉడిపి ప్రజలు ఆహారాన్ని అందించేవారుగా జీవిస్తున్నారు

 

#varahitalks

hara hara mahadev story in telugu

శివుడిని మోహించిన ముని భార్యలు

------------------------------------------------------------------------------------------------------------------

 దారువనం అనే తపోవనం ఉండేది. అక్కడకి చాలా మంది మునులు తపస్సు చేసుకోవడానికి వచ్చేవారు. ఒకసారి ఎందరో మునులు, వారి భార్యలతో సహా అక్కడికి వచ్చారు. అగ్ని దేవుడ్ని ఉపాసిస్తూ కఠోరమైన తపస్సు చేస్తున్నారు.

------------------------------------------------------------------------------------------------------------------

ఒకనాడు వారందరినీ పరీక్షించాలని భావించాడు పరమేశ్వరుడు. ఈశ్వరుడు ఒక సుందర రూపాన్ని ధరించి ఆ దారువనానికి వెళ్లాడు. ఎంతో చక్కని రూపం. చూస్తే కళ్లు చెదిరే అందం అంత చక్కని రూపం ధరించాడు. ఆ ధారువనంలో అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడే ఉన్న ముని భార్యలు ఆ సుందర రూపుడ్ని చూశారు. ఆయన మీద మోహం పెంచుకున్నారు. అబ్బా ఎంత చక్కని రూపం ఆ పురుషునిది. ఆ తేజేమయం కలిగిన పురుషుడ్ని చూస్తే నా ఒళ్లు పులకరించిపోతుంది. అంటూ అతని మీద వ్యామోహం పెంచుకున్నారు. మునులభార్యలు మహా పతివ్రతలు అయినా అతని మీద వ్యామోహం పెంచుకున్నారు.


వారి మనస్సు చలించింది. ఆ సుందర పురుషుడేమో తపోవనంలో నాణ్యం చేస్తూ సంచరిస్తూ ఉన్నాడు. తాపం ఆపుకోలేక మునిపత్ర్నులు యుక్తాయుక్తాలు మరిచి ఆయన వెంట పడ్డారు. తమ శరీరం మీదున్న వస్త్రాలు, ఆభరణాలు శరీరం నుంచి తొలగిపోతున్నాయి. అయినా కూడా ఆ సుందరుడ్ని ఆకర్షించాలని అందంగా నాట్యాలు చేస్తున్నారు. మరి కొందరేమే సంగీతాన్ని ఆలపిస్తున్నారు.

------------------------------------------------------------------------------------------------------------------

ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి మరి ఓ సుందరా.. ఓ సుందరా... ఆగు.. ఆగు... అని ఆయన వెళ్లే దారికి అడ్డంగా నిలబడి కౌగిలించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ స్త్రీలలో మన్మథ వికారం మితీమీరిపోయింది. ఇక తట్టుకోలేక ఆ సుందరరూపుడిని ఆపేశారు.

------------------------------------------------------------------------------------------------------------------

ఎవరు నీవు..? ఎక్కడి నుంచి వచ్చావు. ఓ సుందరాంగా..! దయచేసి మమ్మల్ని అనుగ్రహించు. మా శరీరాలకు ఆనందాన్ని కలిగించు. మధన తాపాన్ని తట్టుకోలేకపోతున్నాము. అని సిగ్గు విడిచి అడిగారు మునిపత్ర్నులు.

------------------------------------------------------------------------------------------------------------------

ముని పత్ర్నులు తనని ఎంతగా రెచ్చగొట్టినా ఆ సుందర పురుషుడు ఏ మాత్రం చలించలేదు. ఏమీ మాట్లాడకుండా నిశ్చిలంగా నిల్చుని ఉన్నాడు..భార్యలు కనిపించకపోవడంతో మునులు ఆ వనంలో వెతుకుతూన్నారు. ఇక్కడేమో ఆ సుందర రూపుడ్ని ప్రాధేయపడుతున్నారు. మునులు భార్యలను చూశారు. కోపంతో అక్కడికి వచ్చారు. తమ భార్యలకు మధన వికారం కలిగించిన అతడిని అనేక విధాలుగా ఎన్నో మాటలతో దూషించారు. ఎన్నో శాపాలు ఇచ్చారు. కాని అవేవి ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి. రుషుల శాపాలు పరమేశ్వరుడి మీద తప్పా మిగిలిన దేవతల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.

------------------------------------------------------------------------------------------------------------------

పూర్వం మునులు ఇచ్చిన శాపాలు :

గతంలో ఒకసారి దధీచి ఇచ్చిన శాపం కారణంగా దక్షుడి యాగం ధ్వంసమైంది. భృగు మహర్షి శాపం వలన శ్రీహరి పది అవతారాలు ఎత్తవలసి వచ్చింది. గౌతముడి ఆగ్రహంతో దేవేంద్రుడి వృషణాలు జారిపడ్డాయి.

పూర్వం మునులందరి శాపంతో శ్రీ హరి శయనించే క్షీర సముద్రం, అమృత సముద్రం తాగటానికి ఏ మాత్రం పనికి రాకుండా పోయింది. అప్పుడు నారాయణుడు కాశీక్షేత్రానికి వెళ్లి క్షీరంతో విశ్వేశ్వరుడిని అభిషేకించాడు. అప్పుడ క్షీర సముద్రం తిరిగి పూర్వ స్థితికి వచ్చింది.

------------------------------------------------------------------------------------------------------------------

ఇక మాండవ్య మహార్షి శాపంతో ధర్మదేవత కృతయుగం నుంచి కలియుగానకి వచ్చే సరికి క్రమంగా క్షీణించ సాగింది. మహాత్ముడైన దుర్వాసుడు ఇచ్చిన శాప ఫలితంగా యాదవులంతా ఒకరినొకరు కొట్టుకుని అంతఃకలహాలలతో అంతరించిపోయారు. భృగు మహర్షి శ్రీహరి | వక్ష స్ధలాన్ని తన్నడంతో అక్కడే నివాసమున్న లక్ష్మీదేవి ఆ స్థానాన్ని వదిలి భూ లోకంలో నివాసం ఏర్పాటు చేసుకుంది. అష్టవసువులు కూడా మునుల శాపాలకు గురై భూ లోకంలో మానవులుగా జన్మించారు.

ఈ విధంగా ఎంతో మంది మునుల, మహార్షుల శాపాలకి గురైనప్పటికీ మహా దేవుడు మాత్రం ముని శాపాల ఫలాన్ని ఏ మాత్రం పొందలేదని ఈ దారువనం కథ చెబుతుంది. ఇలా శంకరుడు సుందర పురుషుడుగా, దిగంబరంగా సంచరించటాన్ని చూసి భరించలేని మునులు ఆయన్ని సామాన్య మానవునిగా భావించి, పరుష పదజాలంతో నిందించటంతో వెంటనే పరమేశ్వరుడు అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు. దీంతో వచ్చింది ఎవరో తెలియక ఆ మునులంతా కలత చెందారు. వెంటనే అక్కడి నుంచి బ్రహ్మా దేవుని వద్దకు వెళ్లారు. జరిగిన విషయం అంతా ఆయనకు చెప్పారు. వారి మాటలు అన్నీ విన్న బ్రహ్మాదేవుడు పరమేశ్వరుడిని మనస్సులో స్మరించుకున్నాడు. ఇదంతా ఈశ్వరుని లీలేనని గ్రహించారు. భక్తితో నమస్కరించాడు.

------------------------------------------------------------------------------------------------------------------

బ్రహ్మా మునులతో ఇలా అన్నాడు. ఓ మునులారా..! మీరెంత అవివేకులు. ఇహపర శ్రేయస్నుని కలిగించే పరమేశ్వరుణ్ణి గుర్తించలేని మీరు వ్యర్ధంగా జన్మించారు. దారువనంలో మీకు కనిపించి న ఆ పురుషుడు సాక్ష్యాత్తు శంకరుడే. మిమ్మల్ని పరీక్షించాలని ఆయన అక్కడికి వచ్చారు.

------------------------------------------------------------------------------------------------------------------

ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చినప్పుడు.. అ ఆతిథి ఎలాంటి వాడైనా, ఏ రూపంలో ఉన్నా అతన్ని గౌరవించాలి. అదే అతిథి సేవ లక్షణం. ఆ ధర్మాన్ని మీరు విస్మరించారు. మునులు చేసిన తప్పిదాన్ని తలుచుకుని ఈశ్వరుడ్ని భక్తితో వేడుకున్నారు. ఈశ్వరుడు వారిని అనుగ్రహించాడు.



25, సెప్టెంబర్ 2021, శనివారం

india famous hindu temples

వింత ఆలయాలు, రహాస్యాలు


 భారతదేశంలో నమ్మశక్యం కానీ వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దేవతలను తిడుతూ భజిస్తారు, కొన్ని చోట్ల దెయ్యాల్ని వదిలిస్తారు, మరికొన్ని చోట్ల భక్తులు తలలు పగలకొట్టుకుని రక్తాన్ని చిందిస్తారు.

------------------------------------------------------------

ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు. 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ అడుగడుగునా దేవాలయాలు మనం చూడవచ్చు. కానీ విచిత్రమైన, అసాధారణ దేవాలయాలు కొన్ని మాత్రమే చూడగలం. ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. అందులో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావడం విశేషం.

------------------------------------------------------------

అసలు ఈ అసాధారణ దేవాలయాల విశేషాలు ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలు తెలుసుకుందాం.




మహేందిపుర్ బాలాజీ దేవాలయం, రాజస్థాన్:

రాజస్థాన్ లోని డౌస జిల్లాలోని మహేందిపుర్ బాలాజీ దేవాలయానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దెయ్యాల్ని, ఆత్మల్ని వదిలించుకోవడానికి వస్తుంటారు. వీపరీతమైన చర్యల ద్వారా, ఉదాహరణకు శరీరంపై వేడి నీరు పోయడం, పై కప్పు నుంచి వేలాడదీయడం, గోడలకు తలను కొట్టడం, గోడలకు మనిషిని తాళ్లతో కట్టడం వంటివి దుష్టశక్తుల నుంచి బాధితున్ని బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు. భారతదేశంలో ఇప్పటికీ భూతవైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది.

ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. అలాగే ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతారు. ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు.

-----------------------------------------------------------

కామఖ్య దేవి ఆలయం : 

అస్సాంలోని గువహతిలో ఉన్న నీలాచల్ కొండపై భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి ఆలయం ఉంది. భారతదేశంలోని 51 పురాతన శక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజలందుకుంటుంది. దీనిపై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతుంటారు. ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో ఈ దేవత రుతుక్రమం జరుగుతుంది. అందుకే ఆ సమయంలో మూడు రోజుల పాటు దేవాలయాన్ని మూసి వేస్తారు. ఆలయం తెరిచే నాల్గవ రోజు వరకూ ఇక్కడ తాంత్రిక సంతానోత్పత్తి పండుగ లేదా అంబుబచి మేళాను జరుపుతుంటారు. ఈ మూడు రోజుల్లో ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర వచ్చే జలం ఎర్రగా వస్తుందని చెబుతారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను కానుకగా సమర్పిస్తుంటారు.

-----------------------------------------------------------

దేవ్ జీ మహరాజ్ మందిర్, మధ్య ప్రదేశ్:

ప్రతి నెలా పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను, దుష్ట శక్తులను వదిలించుకోవడానికిమధ్య ప్రదేశ్ లోని దేవ్ జీ మహరాజ్ ఆలయానికి వస్తుంటారు. దుష్ట శక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతులపై కర్పూరం వెలిగించి వాటిని వదిలించడం ఇక్కడి సాధారణ పద్ధతి. వారి చుట్టూ పరిగెత్తడం లేదా చీపురుతో కొట్టడం వంటివి కూడా చేస్తుంటారు. దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ 'భూత్ మేళా' లేదా 'దెయ్యాల ఉత్సవం' నిర్వహిస్తుంటారు. భారతదేశం యొక్క పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది ఒకటి.




కాలభైరవనాథ్ దేవాలయం :

 పవిత్ర వారణాసి నగరంలో గల కాల భైరవ్ నాథ్ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఇక్కడ నమ్మశక్యం కానీ నిజం ఏమిటంటే కాల భైరవ్ నాథ్ నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు, స్వీట్స్ ను అమ్ముతుంటారు. కానీ ఇక్కడ ఆలయం బయట మద్యాన్ని అమ్మడం విశేషం.

-----------------------------------------------------------

కొడంగల్లూర్ భగవతి ఆలయం, కేరళ:

కాళీ దేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళి దేవికి కొడంగల్లూర్ భగవతి ఆలయంలో ప్రతి ఏటా ఏడు రోజుల వింత భరణి పండుగ నిర్వహిస్తుంటారు. ఈ పండుగలో మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి, కత్తులు పట్టుకుని ఒక తెలియని స్థితిలో తిరుగుతుంటారు. రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు. అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతారు. ఆ తరువాత ఆలయం స్తంభాలను కర్రలతో పదేపదే కొడతారు. పండుగ తరువాత 7 రోజులు ఆలయాన్ని మూసి వేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు.

-----------------------------------------------------------

 స్తంభేశ్వర్ మహదేవ్, గుజరాత్:

మీరు రోజంతా కనిపించి అదృశ్యమయ్యే దేవాలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా? గుజరాత్ లోని వడోదరకు దగ్గర్లో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం అటువంటిదే. ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్లే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెబుతారు. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటి. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శన సాధ్యపడుతుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో భక్తులు వెళ్లి మహాశివుని దర్శనం చేసుకోవచ్చు. మరలా కొన్ని గంటల తరువాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు భక్తులు తిరిగి వెనక్కి వస్తారు. 

-----------------------------------------------------------------------------------------------------------------

బ్రహ్మ ఆలయం, పుష్కర్, రాజస్థాన్

ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగా రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఔరంగజేబు కంట పడినా కూడా నేటికీ చెక్కుచెదరక మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మ దేవుని ఆలయం ఒకటి. ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం ఇదే. హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడా గుడి లేకపోవడం విశేషం. పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలో గోడలు వెండి నాణేలతో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇవి దాతలు, భక్తుల పేర్లతో కనిపిస్తాయి.

-----------------------------------------------------------

దేవరగట్టు ఆలయం, ఆంధ్రప్రదేశ్ :

భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కర్రలను చేతపట్టుకుని అర్ధరాత్రి వరకూ ఒకరి తలలపై ఒకరు కొట్టుకుంటారు. ఇక్కడి మాల మల్లేశ్వరుడు (శివుడు) చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తుంటారు. దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇదివరకు లాఠీలకు బదులు గొడ్డలి, బాకులను వాడే వారు.

#varahitalks

virudhachalam temple history in telugu

 వృద్దగిరీశ్వర ఆలయం.... వృద్ధాచలం..

-----------------------------------------------------------------------------

కాశీ.. ఈ పేరు చెప్పగానే పవిత్రమైన భక్తి భావం పొంగుతుంది. గంగలో మునిగితే చాలు.. సకల పాపాలు తొలగి, ముక్తి లభిస్తుంది. ప్రతి హిందూవు తన జీవితంలో ఒక్క సారైన చూడాలి అనుకునే గొప్ప ఆలయాల్లో కాశీ ఒకటి.

అయితే ఈ వీడియోలో కాశీ కంటే గొప్ప ఆలయం, శివుడు నడయాడిన స్థలం, వియుకుడే వచ్చి దర్శనం ఇచ్చిన ఆలయం.. అంతేనా ఇంకా ఎన్నో అద్భుతాలు, శివుని మహిమలు కలిగిన గొప్ప ఆలయం గురించి మీకు చెప్పబోతున్నాను.


ఎక్కడ ఉంది :

తమిళనాడు ప్రాంతంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. అందులో చరిత్ర కలిగిన ఆలయం వృధ్ధకాశీ. దీనినే వృద్ధాచలం అని కూడా అంటారు. శైవులకి ముఖ్యమైన క్షేత్రాలు 108. వాటిలో 4 క్షేత్రాలు అతి ముఖ్యమైనవి. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా లో వృద్ధాచలం అతి పురాతనమైన క్షేత్రం. భూకంపాలు, వరదలు, యుద్దాలు వచ్చినా కూడా చెక్కు చెదరని ఆలయం. ఇక్కడ స్వామిని సేవించినవారికి కాశీలో విశ్వనాధుని సేవించినదానికన్నా కొంచెం ఎక్కువే పుణ్యం వస్తుంది. సాక్ష్యాత్తు పరమ శివుడే ఇక్కడ ఆనంద నాట్యం చేశాడని చరిత్ర చెబుతుంది. ఇక్కడ వుట్టినా, గిట్టినా, నివసించినా, భగవంతుణ్ణి ప్రార్ధించిన ఈ స్వామిని తలచినా మోక్షం లభిస్తోంది.

-----------------------------------------------------------------------------------------------------------------------

స్థల పురాణం :

శివుడు ప్రధమంగా ఇక్కడ కొండ రూపంలో వెలిశాడు. అందుకే ఈ క్షేత్రం పేరు పఝమలై అని తమిళంలో వచ్చిన తర్వాత సంస్కృతంలో వృద్ధాచలం అయింది. పూర్వం ఒకసారి ఈ ఊరి ప్రజలు కరువు కాటకాలతో, చాలా ఇబ్బందులలో వుంటే, స్వామివారు కనిపించి నాకు సేవ చేయండి చేసినవారికి చేసినంత లభిస్తుందని చెప్పాడట. అప్పుడు 'విభాసిత మహర్షి' మణిముత్తా నదిలో స్నానం చేసి, ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాడు. పని చేసిన వారికి ధనమునకు బదులు వన్నిచెట్టు ఆకులు కూలీకింద ఇచ్చేవాడుట. ఆ మనిషి చేసిన పని, దాని నాణ్యతకు తగినట్లుగా ఆ ఆకులు నాణాలుగా మారేవట. అప్పటి నుంచే 'చేసినవారికి చేసినంత, చేసుకున్నవారికి చేసుకున్నంత' అనే నానుడులు వచ్చాయంటారు పెద్దలు. ఈ వృక్షం వయస్సు 1,700 సంవత్సరాల క్రితందని పరిశోధకులు తేల్చేరు !! 

-----------------------------------------------------------------------------------------------------------------------

పాట పాడించుకున్న శివుడు : 

సుందరార్ అనే గాయకుడు ఉండేవాడు. పేదవాడు. కుటుంబ అవసరాల కోసం పాటలు పాడి డబ్బులు సంపాదించుకునేవాడు. ఒకరోజు అతను తిరువారూర్కి బయల్దేరాడు. ఈ క్షేత్రం నుంచి వెళ్తూ స్వామిని స్తుతించకుండా వెళుతున్నాడు. ఆయనని ఆపి, పాడించుకున్నాడు శివుడు. బహుమతిగా 12,000 బంగారు నాణాలు ఇచ్చాడట. 

-----------------------------------------------------------------------------------------------------------------------

ఆయన వెళ్లే దారిలో దొంగల భయం ఎక్కువగా వుండటంవల్ల నష్టపోతాడేమోనని ఆ నాణాలను మణి ముత్తానదిలో వేసి "తిరువారూర్ వెళ్లి అక్కడ ఆలయంలో వున్న కొలనులోంచి" తీసుకొమ్మని చెప్పాడట. ఆయన అలాగే తీసుకున్నాడు. ఇవి స్వామి ఇచ్చిన నాణేలేనా కాదా అనే ఆలోచన అతనికి వచ్చిందంటా... అప్పుడు సాక్ష్యాత్తు వినాయకుడే వచ్చి ఇవి నా తండ్రి ఇచ్చిన నాణేలే అని చెప్పాడంటా.. అరుణాచలం (తిరువణ్ణామలై)లో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి భక్తులు ఇక్కడా గిరి ప్రదక్షిణ చేస్తారు.

-----------------------------------------------------------------------------------------------------------------------

సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ప్రత్యేకత :

ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి వున్నాడు. ఆలయం పైన శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. ఇక్కడి ప్రత్యేకతలు. అందుకే ఇక్కడి స్వామికి విన్నవించుకుంటే కోరికలు త్వరగా తీరుతాయట. శైవ సిద్ధాంత ప్రకారం 28 ఆగమ శాఖలు వున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివ లింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడు. ఆ సిద్ధాంతాల పేర్లతోనే శివుని పేర్లు కూడా కామికేశ్వరుడు, యోగేశ్వరుడు మొదలగు పేర్లు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ విశేషం వల్ల ఈ ఆలయానికి "ఆగమ ఆలయ"మనే పేరుకూడా వచ్చింది.

-----------------------------------------------------------------------------------------------------------------------

విఘ్నేశ్వర ఆలయం ప్రత్యేకత :

ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఎడమవైపు కనిపించే ఉపాలయంలో విఘ్నేశ్వరుడు కొలువు దీరి వుంటాడు. శ్రీ కాళహస్తిలో ఉన్నట్లుగానే  విఘ్నేశ్వరుడు భూతలం నుంచి కిందకి వున్న ఆలయంలో వుంటాడు. దర్శించటానికి 18 మెట్లు దిగి వెళ్ళాలి. ఇక్కడి అమ్మవారి పేరు వృద్ధాంబిక. 


అమ్మవారి కథ :

పూర్వం నమశ్శివాయార్ అనే భక్తుడు చిదంబరం వెళ్తూ ఒక రాత్రి ఇక్కడ బస చేశాడు. ఆయనకి బాగా ఆకలయింది. పరమేశ్వరిని ఆకలి తీర్చమంటూ చేసిన స్తుతిలో అమ్మని పొరపాటున "కిజతి" అన్నాడు. అంటే పెద్దావిడ, ముసలావిడ అనే పదం వాడాడు. ఆ తల్లి వృద్ధురాలి వేషంలో వచ్చింది. నమశ్శివాయార్ కిజతి ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే తినడానికి పెట్టండి అన్నాడు. ముసలివాళ్ళు భోజనం పెట్టలేరు నయనా.. చిన్నవాళ్ళే పెట్టగలరని చెప్పిందట. అప్పుడు ఆ భక్తుడు అమ్మవారిని యువతిగా వర్ణిస్తూ పాడేసరికి అమ్మ ఒక యువతిగా వచ్చి ఆయనకి భోజనం పెట్టిందట. అప్పటినుంచి అమ్మని 'బాలాంబిక'గా పిలుస్తారు. 

-----------------------------------------------------------------------------------------------------------------------

భక్తుల నమ్మకం : 

ఇక్కడ శివుడు స్వయంభువుడు. శివుణ్ణి ప్రార్ధించినవారికి మనశ్శాంతి కలగటమేకాక అన్ని రకాల శరీర రుగ్మతలనుండి వెంటనే విముక్తి కలుగుతుంది. ఇక్కడ వున్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, పిల్లలు పుట్టటం, వంటి కోరికలు నెరవేరటమేకాక, జీవితంలో అభివృద్ధిక ఆటంకాలు కూడా తొలుగుతాయి. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణి ముత్తానదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్ళుగా మారి నది అడుగు భాగంలో నిలిచి వుంటాయట.

-----------------------------------------------------------------------------------------------------------------------

భైరవ పూజ : 

ఆదివారం, రాహుకాల సమయంలో అంటే 4-30 నుంచి 6 గం.ల దాకా.. భక్తులు ఇక్కడ భైరవుడికి వడమాల వేసి పూజలు చేస్తారు. దీనివలన కష్టాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఆదిదేవుట్టి ఇక్కడ కొలిచినవారికి ఈ జన్మలో సుఖంగా వుండటమేగాక, వచ్చే జన్మలో కూడా మంచి జీవితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

-----------------------------------------------------------------------------------------------------------------------

ఐదవ నంబర్ ఈ ఆలయంలో ప్రత్యేకం

  • 5 నంబరు ఈ ఆలయ చరిత్రలో భాగం, ఆలయ ప్రాంగణంలో పూజలందుకునే మూర్తులు ఐదుగురు. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. 
  • ఇక్కడ ప్రధాన దేవుడు శివుడు స్వామికి 5 పేర్లున్నాయి విరుధగిరీశ్వరుడు, వఝుమలైనా థార్, విరుధ్ధాచలేశ్వర్, ముద్దుకుంద్రీశ్వరుడు, వృద్ధ గిరీశ్వరుడు. 
  • ఇక్కడ 5 వినాయక విగ్రహాలున్నాంటాయి. ఐదుగురు ఋషులు స్వామి దర్శనం చేశారు. వారు రోమేశుడు, విబాళిద్దు, కుమారదేవుడు, నాదశర్మ మరియు అనవర్దిని.
  • ఆలయానికి 5 గోపురాలు, 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు వున్నాయి. 
  • వేకువఝామునుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయాల్లో 5సార్లు పూజలు చేస్తారు. 
  • ఆలయాని కి 5 రథాలున్నాయి. వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వరవ్వామికి, వఝుములైనాధార్కి, పెరియనాయకికి (శివుడు, పార్వతి), వీరభద్రుడికి, 5 పేర్లున్నాయి. తిరుముద్దుకుండ్రం, వృద్ధకాశి, వృద్ధాచలం, నెర్ కుప్పాయ్, ముద్దుగిరి. 
  • పరమశివుడు నాట్యానికి ప్రసిద్ధి. చిదంబరంలో కాళితో పోటీపడి నృత్యం చేస్తే, ఇక్కడ వృద్ధాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడట. ఆనంద రూపంలో ఉండే శివుడిని ప్రార్ధిస్తే వెంటనే ఫలితం వస్తుందని భక్తుల భావన.

-----------------------------------------------------------------------------------------------------------------------

మోక్షాన్ని ప్రసాదించే శివుడు : 

వృద్ధాచలాన్ని వృధ్ధ కాశి అని కూడా అంటారు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది అంటారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృధ్ధకాశీ అని చెప్పబడే ఈ వృద్ధాచలంలో మరణించిన వారికి అంతకన్నా కొంచెం ఎక్కువ పుణ్యమే వస్తుందిట. కాశీలో చెప్పబడ్డట్లుగానే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సు తన ఒడిలో వుంచుకుని అమ్మ వృద్ధాంబిక తన చీరె కొంగుతో వినురుతూండగా, వారి చెవిలో వరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి, వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

#varahitalks

22, సెప్టెంబర్ 2021, బుధవారం

valmiki ramayanam telugu

నారాదుడు చెప్పిన రామాయణం

-------------------------------------------------------------------------------------------------------------

రామాయణం రాయడానికి ముందు వాల్మీకి మహార్షి నారదుని 

మధ్య జరిగిన సంభాషణ ఇది.

నారదుడు ఒకరోజు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఓ నారద మహార్షి..! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమంతుడు, ధర్మాత్ముడు, ఎదుటి వారి ఎడల ఆధణర భావము కలవాడు. గట్టి సంకల్పము, అనుకున్న పని నెరవేర్చే గుణము, యుద్ధ రంగంలో దిగితే దేవతలను కూడా జయించగలిగేవాడు. మానవుడు ఎవరైనా ఉన్నారా..? అని అడిగాడు...

 



నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు.. ఓ మహార్షి నీవు చెప్పిన గుణములు సామాన్య మానవునిలో కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణమైనవి. కానీ ఒక మహాపురుషుడున్నాడు.
ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి. ఆ వంశములో రాముడు అనే పేరు గల మహా పురుషుడు జన్మించాడు. అందరి చేత కీర్తించబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు. మహావీరుడు, మంచి ప్రకాశముగలవాడు అసాధారణమైన ధైర్యము అతని సొంతం.
---------------------------------------------------------------------------------------------------------

అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు. నీతిమంతుడు. సకలశాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు.
రాముడు శత్రుభయంకరుడు. ఆజానుబాహుడు. అందగాడు. విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనస్సు చాలా గొప్పది. రాముడు అంత పొట్టికాదు, పొడుగూ కాదు. రాముడికి అన్ని అవయములు సమపాళ్లలో ఉన్నాయి. సకల ధర్మాలు తెలిసినవాడు. సత్యమునే పలికేవాడు. ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరతాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు.
---------------------------------------------------------------------------------------------------------

"రాముడు సముద్రం వలె గంభీరంగా ఉంటాడు. హిమాలయము వలే ధైర్యముగా నిలబడతాడు."
ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రిడిగా జన్మించాడు. పరాక్రమములో విష్ణువుతో సమానుడు. పున్నమి చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంతే ఆనందం రాముడిని చూస్తే కలుగుతుంది. కాని రాముడికి కోపం వచ్చిందా ప్రళయమే. ఓర్పులో భూదేవిని, ధానములో కుభేరుడిని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు.
అటువంటి రామునికి తండ్రి దశరధుడు. రాముడికి పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఈ విషయం దశరధుని భార్య కైకకు నచ్చలేదు. గతంలో దశరధుడు తనకు ఇచ్చిన వరములు ఇమ్మని కోరింది. ఆ రెండు వరములో ఒకటి రాముడిని రాజ్యము నుంచి వెళ్లగొట్టడం.


రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేయటం. మాట తప్పని దశరధుడు రాముడిని వనవాసమునకు వెళ్లమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావహించి, రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు పయనమయ్యాడు. తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముడిని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని రాముని వెంట వస్తానన్నాడు.

---------------------------------------------------------------------------------------------------------
భార్య సీత రాముడికి ప్రాణ సమానురాలు. ఆమె జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న నారీలోకములలో ఉత్తమురాలు. రాముడిని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు పయనమయింది. రాముడు, లక్ష్మణుడు, సీత అడవులకు వెళుతుంటే అయోద్య ప్రజలు గంగానది దాకా వచ్చారు. రాముని ఆదేశంతో అయోధ్యకు మరలివచ్చారు. రాముడు, సీత, లక్ష్మణుడు రాత్రికి శృంగిభేరపురములో గుహుడు అనే నిషాదుడిని కలుకున్నారు. రధమును వెనక్కి తీసుకుని వెళ్లమని తన సారధిని పంపివేశాడు. మరునాడు గంగానదిని దాటారు. 

---------------------------------------------------------------------------------------------------------

ఒక వనము నుంచి మరోక వనమునకు పోతూ, భరద్వాజ మహార్షి ఆదేశము మేరకు చిత్రకూటము అనే ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక వర్ణశాలను నిర్మించుకున్నారు. ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నివశిస్తున్నారు. అయోద్యలో ఉన్న దశరధుడు పుత్రవియోగం తట్టుకోలేక స్వర్గస్థడయ్యాడు.


భరతుడిని రాజ్య పాలన చేయమని వశిష్టుడు మొదలగు వారు కోరారు. కాని భరతుడు ఒపుకోలేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్లాడు. రామునికి తండ్రి మరణ వార్త తెలిపి, తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాటించడం తన ధర్మమని, రాజ్యపాలనకు ఒప్పుకోలేదు. రాముడు తన పాదులకను భరతునికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు భరతునికి చెప్పి పంపివేశాడు. రామపాదుకలను భక్తితో తీసుకుని ఆయోద్య వెలుపల ఉన్న నందిగ్రామమునకు వెళ్లాడు. అక్కడ రాముని పాదులకు ఉంచాడు. రాముడు తిరిగి రావాలని కోరుకుంటూ అక్కడి నుంచే రాజ్యపాలన చేశాడు.

---------------------------------------------------------------------------------------------------------

తరువాత దండకారణ్యము ప్రవేశించాడు రాముడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుడిని చంపాడు. శరభంగ మహార్షిని, సుతీక్ష్య మహార్షిని, అగస్త్య మహార్షిని సందర్శించాడు. తరువాత కొందరు మునులు రాముడిని చూడటానికి వచ్చారు. రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని, వారిని సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముడిని వేడుకున్నారు. రాక్షస సంహారము చేస్తానని రాముడు వారికి మాట ఇచ్చాడు. 

---------------------------------------------------------------------------------------------------------

ఆ దండకారాణ్యములోనే రావణుని సేనలూ ఉన్నాయి. రావణుని చెల్లెలు కూడా అక్కడే ఉంది. పేరు శూర్పణఖ. ఆమె కామరూపిణి. ఆమె రాముడిని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు. శూర్పణఖ వెళ్లి రావణుని సైన్యాధిపతులైన ఖర, దూషణ, త్రిశిరులకు జరిగిన అవమానం గురించి చెప్పింది.. వారందరూ రాముని మీదకి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధము చేసి 14వేల మంది రాక్షసులను సంహరించాడు.

---------------------------------------------------------------------------------------------------------

ఈ వార్త విన్న రావణుడికి కోపం వచ్చింది. తనకు సాయం చెయ్యమని మరీచుడు అనే రాక్షసుడిని కోరాడు. మరీచుడు ఒప్పుకోలేదు. ఖర, దూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహా వీరునితో వైరము పెట్టుకోవద్దని చెప్పాడు. కాని రావణుడు వినలేదు. మరీచుడిని బలవంతంగా ఒప్పించాడు. మరీచుడిని వెంటబెట్టుకుని రావణుడు రాముడు ఉండే ఆశ్రమానికి వెళ్లాడు. మరీచుని సాయముతో రాముడిని, లక్ష్మణుడిని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపాడు.

---------------------------------------------------------------------------------------------------------
రామ లక్ష్మణులు ఆశ్రమానికి తిరిగివచ్చారు. సీత కనిపించలేదు. సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించింది. రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. జటాయువునకు దహన సంస్కారాలు చేశారు. ఆ తరువాత సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుడిని చూశారు. తమకు అపకారము చేయబోయిన కబంధుడిని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్లమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు.

---------------------------------------------------------------------------------------------------------
శబరి ఆశ్రమానికి వెళ్లారు. శబరి వారిని పూజించింది. అక్కడి నుంచి పంపా తీరమునకు వెళ్లారు. హనుమంతుడిని చూశారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహము చేశారు. రాముడు తన గురించి సీతాపహరణము గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడేమే.. తనకు తన తన్న వాలికి ఉన్న వైరము గురించి రాముడికి చెప్పాడు. వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు రాముడు. కాని రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానము కలిగింది. అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలి గోటితో పది యోజనములు దూరంగా పడేటట్లు విసిరివేశాడు. ఒకే బాణంతో ఏడు మర్రిచెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముడి మీద నమ్మకం కలిగింది.

---------------------------------------------------------------------------------------------------------

రాముడిని వెంట తీసుకుని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్లారు. సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు. వాలి భార్య 'తార' వాలిని యుద్ధమునకు వెళ్లవద్దని వారించింది. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుడిని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుడిని చేశాడు.

---------------------------------------------------------------------------------------------------------

తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెతుకమని వానరులను నలుదిక్కులకూ పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోక వనంలో దుక్కిస్తున్న సీతను చూశాడు. హనుమంతుడు సీత వద్దకు వెళ్లాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ, సుగ్రీవుల మైత్రీ గురించి చెప్పాడు. తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వసం చేశాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేవాపతులను ఐదుగురిని చంపాడు. అక్షకుమారుని చంపాడు. చివరికి బంధించబడ్డాడు. తరువాత తనని తాను విచిపించుకుని లంకాధహనము చేశాడు.

---------------------------------------------------------------------------------------------------------

హనుమంతుడు లంక నుంచి రాముడి వద్దకు వచ్చాడు. "అమ్మను చూశాను". అని రామునితో చెప్పాడు. తరువాత వానర సేనతో సముద్ర తీరము చేరుకున్నారు. తనకు దారి ఇవ్వని సముద్రుడిని రామ బాణంతో అల్లకల్లోలం చేశాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు 'నీలుని'తో వారధి కట్టించాడు. ఆ సేతువు మీదుగా లంకకు చేరుకున్నారు. రావణునితో యుద్ధము చేసి సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు.

---------------------------------------------------------------------------------------------------------

ఆ మాటలు భరించలేక సీత అగ్ని ప్రవేశము చేసింది. అగ్నిదేవుడు వచ్చి 'సీత కల్మషము లేనిది' అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు. రావణ సంహారం చేసినందుకు రాముడిని సమస్త దేవతలు, ఋుషులూ ఎంతగానో శ్లాఘించినారు రాముడు విభీషణుడిని లంకారాజ్యమునకు రాజును చేశాడు. రాముడిని చూడటానికి వచ్చిన దేవతలు అనేక వరాలు ఇచ్చారు. ఆ వరాలతో యుద్ధములో చనిపోయిన వానరులందరినీ బతికించారు. అందరూ పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు వెళ్లారు.

---------------------------------------------------------------------------------------------------------

రాముడు ముందు భరధ్వాజ ఆశ్రమానికి వెళ్లాడు. హనుమంతుడిని నంది గ్రామములో ఉన్న భరతుని వద్దకు పంపాడు. తరువాత రాముడూ నందిగ్రామమునకు వెళ్లాడు. తన సోదరులను కలుసుకున్నాడు. ముని వేషధారణను వదిలి రాముడు, సీత, లక్ష్మణుడు క్షత్రియ రూపానికి మారారు. రాముడు అయోద్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకమునకు లోకాలన్నీ సంతోషించాయి.

---------------------------------------------------------------------------------------------------------

రామడి పాలననలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిశాయి. దుర్భిక్షము లేదు. తండ్రీ జివించి ఉండగా పుత్రులు మరణించడం అనేది లేదు. స్త్రీలందరరూ పతివ్రతలుగా ఉన్నారు. రామ రాజ్యంలో అగ్ని, జల, ఆకలి భయం గాని లేవు. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషముగా జీవించారు.

---------------------------------------------------------------------------------------------------------

రాముడు లెక్కలేనన్ని ఆశ్వమేధ యాగములు చేశాడు. లక్షల కొలది గోవులను బ్రాహ్మాణులకు దానంగా ఇచ్చాడు. రామ రాజ్యములో "నాలుగు వర్ణములవారు" తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషముగా జీవించారు. ఆ ప్రకారముగా "రాముడు 11,000 సంవత్సరాలు" రాజ్య పాలన చేసి తుదకు బ్రహ్మా లోకానికి చేరుకున్నాడు.

#varahitalks

13, సెప్టెంబర్ 2021, సోమవారం

who is mahishasura


మహిషాసురుడు ఎవరు..?

-------------------------------------------------------------------------

మహిషాసురుడు ఎవరు..? ఎలా జన్మించాడు.. పరమేశ్వరి ఎందుకు సంహారించింది. మహిషాసురుని గురించి. .. 

-------------------------------------------------------------------

బ్రహ్మా మానస పుత్రుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు. ఇతడికి ధనువు నందు రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు. వీరికి కుమారులు లేరు. అందుచేత సంతానం కోసం తపస్సు చేయడం మొదలు పెట్టారు. కరంభుడు పీకల్లోతు నీటిలో దిగి తపస్సు చేస్తున్నాడు. ఆ విషయం తెలిసి ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుణ్ణి చంపేశాడు. రంభుడు పంచాగ్ని మధ్య ఉండి తపస్సు చేస్తున్నాడు. తన అన్న మరణించిన విషయం తెలుసుకున్న రంభుడు ఇంద్రుని మీద పగ తీర్చుకోవటానికి సరైన బలాద్యుడు, దేవతలను జయించగలిగినవాడు. కుమారుడిగా కావాలి అని ప్రార్ధించాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు.. 



ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు. దానికి రంభుడు స్వామీ అజేయుడు, అపూర్వ భలశాలి, కామరూపి, ముల్లోకాలను జయించగల కుమారుడు కావాలి. అన్నాడు. ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు ముందుగా నీవు ఎవర్ని చూసి మోహిస్తావో, వారి యందు నీవు కోరిన లక్షణాలు కలిగిన బాలుడు పుడతారని వరమిచ్చాడు. రంభుడు ఇంటికి బయలుదేరాడు. దారిలో యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది కాంతలు ఎంతోమందిని చూశాడు. అతని మనసు చెదరలేదు. ఒక సెలయేటి వడ్డున మహిష్మతి అనే గంధర్వ కాంత శాప ప్రభావముతో మహిషముగా జన్మించి గడ్డిమేస్తోంది. 

--------------------------------------------------------------------------------------------------------

దాన్ని చూడగానే రంభుడికి మనస్సు చలించింది. ఆ గేదె గర్భం దాల్చింది. ఆ గెదెను ఇంటికి తీసుకుపోయాడు. కొంతకాలానికి ఆ గేదె మనిషి శరీరము, దున్నపోతుతలతో ఒక బాలుడుని ప్రసవించింది. వాడే మహిషాసురుడు.. ఆ బాలుడు జన్మించగానే శాపవిమోచనమయి గంధర్వ లోకానికి వెళ్లిపోయింది మహిష్మతి.

--------------------------------------------------------------------------------------------------------

మహిషుడు బ్రహ్మాను గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మాదేవుడు ప్రత్యక్షమైనాడు. మరణం లేకుండా వరం కావాలన్నాడు మహిషుడు. లాభం లేదు. ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు. బ్రహ్మా, ఆలోచించాడు మహిషుడు. స్త్రీతో తప్పా మరెవరితోనూ మరణం లేకుండా వరమియ్యమన్నాడు. తథాస్తూ అన్నాడు బ్రహ్మా.

-------------------------------------------------------------------------------------------------------

వర ప్రసాది అయిన మహిషుడు రాక్షస గణాలను చేరదీశాడు. ముల్లోకాలను జయించాలని సంకల్పించాడు. యుద్ధానికి బయలుదేరాడు. భూలోకము అతనికి పాదాక్రాంతమైంది.


ఇక దేవదానవ గణాల మధ్య యుద్ధం సాగుతోంది. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. త్రిమూర్తుల దగ్గరకు వెళ్లారు. త్రిమూర్తులతో సహా దేవతలంతా సభను ఏర్పాటు చేశారు. మహిషుణ్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అప్పుడు దేవతలందరి ముఖాల నుంచి వారి శక్తి బయటకు వచ్చింది. ఒక స్త్రీ రూపం ధరించింది. ఆ స్త్రీ మూర్తి శరీరములోని ఒక్కొక్క అంగము, ఒక్కొక్క దేవత యోక్క తేజస్సుతో నిండిపోయింది. మహా తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ స్త్రీ మూర్తి తప్పకుండా మహిషుడిని సంహరిస్తుంది. అప్పుడు దేవతలందరూ తమ దగ్గర ఉన్న ఆయుధాలను ఆమెకిచ్చారు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. 

--------------------------------------------------------------------------------------------------------

వివిధ రత్నాలు, ఆభరణాలు ఇచ్చారు. వాటన్నింటినీ ధరించి ఆ పరమేశ్వరీ అట్టహాసం భీకర గర్జన చేసింది. ఆ అట్టహాసానికి దిక్కులు దద్దరిల్లాయి. ముల్లోకాలు గడగడలాడాయి. ఆ శబ్ధం రాక్షసులకు చేరింది. అక్కడి వారికి పరమేశ్వరి కనిపించింది. రాక్షసులు ఆమోతో యుద్ధానికి తలపడ్డారు.



రాక్షనసేన పరమేశ్వరినీ చుట్టుముట్టింది. వారందరినీ పరమేశ్వరీ సంహరించింది. మహిషుని సేనాదిపతి చిత్తురాక్షుడు మరణించాడు. ఇక లాభం లేదని మహిషుడు పరమేశ్వరికి ఎదరు నిలిచాడు. 

--------------------------------------------------------------------------------------------------------

వారిద్దరి మధ్య పోరు ఘోరంగా సాగింది. మహిషుడు తన నిజ స్వరూపం ప్రదర్శించాడు. పరమేశ్వరి ఆగ్రహంతో ఊగిపోతూ కాలితో మహిషుని పీక తొక్కి పట్టింది. కత్తితో అతని శిరస్సు ఖండించింది. రాక్షసుడు మరణించాడు. ఈ విధంగా మహిషాసురుడు పరమేశ్వరీ చేతిలో సంహరించబడ్డాడు.

#varahitalks


12, సెప్టెంబర్ 2021, ఆదివారం

When and how did Dwapar yuga ended?

ద్వాపర యుగం చివరిలో జరిగింది ఏమిటి

-----------------------------------------------------------------------------------------------------

 క్రిష్ణుని నిర్యాణం..

-----------------------

ద్వాపర యుగం అంతం

-------------------------------

ద్వారక నీటిలో మునక


కురుక్షేత్ర యుద్ధం తరువాత జరిగిన సంఘటనలు ఏమిటి..? క్రిష్ణుడు, బలరాముడు, రుక్మీణీ, సత్యభామ మొదలగు వారు ఏమయ్యారు. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు విజయం సాధించడంతో ధర్మరాజు హస్తినాపురానికి రాజు అయ్యాడు. సుమారు 36 సంవత్సరాల పాటు అతను రాజ్య పాలన చేశాడు. ఆ తరువాతే యాదవ రాజ్యం నాశనం కావడం క్రమంగా ప్రారంభమైంది. యాదవ రాజ్యం అంతం కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. తన నూరుగురు కుమారులు యుద్ధంలో మరణించడంతో ఎంతో బాధపడిన గాంధారి క్రిష్ణుడికి శాపం ఇచ్చింది. ఆమె శాపం ఫలించడానికి సుమారు 36 సంవత్సరాలు పట్టింది.


ఇక రెండవ కారణం.. ఒక రోజు శ్రీ క్రిష్ణుడిని చూడాలని కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు మరియు వారి శిష్య బ్రుందము ద్వారకకు వచ్చారు. ఆ సమయంలో కొందరు యాదవ యువకులు క్రిష్ణుని కుమారుడికి ఆడపిల్ల వేషం వేసి మునుల వద్దకు తీసుకుపోతారు. ఓ మునులారా ఈమెకు పెళ్లి అయ్యి చాలా కాలం అయింది కానీ సంతానం మాత్రం లేదు. మీరు మునులు కదా దయచేసి చెప్పండి. ఈమెకు సంతానం కలుగుతుందా.. అని అడుగుతారు. ఇది ఆకతాయిల పని అని తెలుసుకున్న ఆ మునులు.. ఓ తప్పకుండా సంతానం కలుగుతుంది. కాకపోతే ఓ ముసలాన్ని (ముసలం అంటే రోకలి లేదా నాశనకారి అని అర్థం) కంటుంది అని చెబుతారు. మునులు చెప్పిన విధంగానే ఆమె అంటే.. క్రిష్ణుని కుమారుడు అయిన సాంబుడు ముసలాన్ని కంటాడు. 

----------------------------------------------------------------------------------------------------------------

దానిని ప్రజలు చూస్తే ఎక్కడ తమ పరువు పోతుందేమో అని.. వసుదేవుడు రాత్రికి రాత్రే ఆ ముసలాన్ని పొడిగా చేసి సముద్రంలో కలిపివేస్తాడు. కొన్ని రోజుల తరువాత ఈ రెండు శాపాల ఫలితంగా ఏదో ఒక ఉపద్రవం ద్వారకలో జరుగుతూనే ఉంది. ఎన్నో అశుభాలు వారికి కనిపిస్తున్నాయి. ఇలాంటి ఉపద్రవాలు మళ్లీ ..మళ్లీ జరుగుతుండటంతో గాంధారి, రుషుల శాపాలు ఫలిస్తున్నాయని, యాదవ కుల నాశనం ఇక తప్పదని శ్రీక్రిష్ణుడు గ్రహిస్తాడు. ఎలాగూ నాశనం తప్పదు. ఆ జరిగే నాశనం ఏదో.. పుణ్యక్షేత్రము, సముద్రతీరము అయి అక్కడే ఈ నాశనం జరిగితే మంచిదని నిర్ణయిస్తాడు. అందరినీ అక్కడికి చేర్చాలి. మాములుగా రమ్మంటే రారు కదా.. 

----------------------------------------------------------------------------------------------------------------

అందుకే ఒక జాతరను ఏర్పాటు చేస్తాడు. అందరినీ జాతర పేరుతో అక్కడికి తీసుకుపోయాడు క్రిష్ణుడు. మరోవైపు యాదవులంతా మధ్యానికి బానిసలు అయ్యారు. సాత్యకి, క్రుతవర్మ తగువులాడుకోవడం ప్రారంభించారు. సముద్రంలో ఉన్న తుంగపరకలేమో శాపబలంతో ఆయుధాలుగా మారాయి. వాటితోనే వారిలో వారే అంతఃకలహాలతో ఒకరినొకరు పొడుచుకుంటూ చనిపోతున్నారు.

----------------------------------------------------------------------------------------------------------------

ఇదంతా జరడానికి ముందే బలరాముడు తపస్సు చేసుకుందామని అరణ్యాలకు వెళ్లిపోతాడు. తన కళ్లముందే యాదవ వీరులంతా.. ఒకరినొకరు నరుక్కుని నాశనం అవుతుంటే క్రిష్ణుడు ఎంతో బాధపడతాడు. ఇదంతా చూడలేక దారుకునితో ఇలా చెబుతాడు. యాదవ వర్గం నాశనం కాబోతుంది. నీవు వెళ్లి అర్జునుడిని ద్వారకకు తీసుకురా.. అని చెప్పి పంపిస్తాడు. అతను ద్వారక నుంచి బయలుదేరతాడు. తరువాత బభ్రుడనే మరొక యాదవుడూ.. 

----------------------------------------------------------------------------------------------------------------

అక్కడే వుండగా అతడికి స్త్రీలను, గుర్రాలను, ఏనుగులను అన్నింటినీ ద్వారకకు చేర్చు అని చెబుతాడు. క్రుష్ణుడు చెప్పినట్లు వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఇంతలో క్రిష్ణుడు చూస్తుండగానే ఓ బోయవాడు పిచ్చిపట్టినట్లు ఎగురుతూ వచ్చి బభ్రుడి మీదకు తుంగపరక విసురుతాడు. బభ్రుడు మరణిస్తాడు. ఇక చేసేది ఏమీ లేక అప్పగించిన పనికి తానే పూనుకుని స్త్రీలను, రథాలను, గుర్రాలను, ఏనుగులను ద్వారకకు చేర్చుతాడు. అక్కడి నుంచి వసుదేవుడి వద్దకు వెళతాడు.. అతనికి జరిగింది. జరగబోయేది అంతా వివరంతా చెబుతాడు. ఇదంతా విన్న వసుదేవుడు ఇంత దారుణం జరుగుతుందా.. అని సొమ్మసిల్లి పడిపోతాడు. అతడిని లేపి సపర్యలు చేస్తాడు క్రిష్ణుడు. ఆ తరువాత నేను కూడా అన్న బలరాముడి వద్దకు వెళ్లి తపస్సు చేసుకుంటాను. 

----------------------------------------------------------------------------------------------------------------

ఇక్కడ ఉండలేను అని చెప్పి, ఇక మీరే అంతా చూసుకోవాలి. మీతో పాటు అర్జునుడు కూడా ఉంటాడు. మీ దుఖాలన్నింటినీ అర్జునుడు పోగొడతాడు. తరువాతి కార్యాలను కూడా అతనే చూసుకుంటాడు. మీరు దిగులు పడకండి అని చెప్పి బలరాముడిని వెతుక్కుంటూ క్రిష్ణుడు వెళతాడు. తరువాత కొంత సమయానికి అరణ్యంలో వెతకగా బలరాముడు కనిపిస్తాడు. అతని వద్దకు వెళ్లగానే ఒక మహా సర్పం బలరాముని ముఖం నుంచి వేయి నోళ్లతో.. ఎర్రని కన్నులతో వచ్చి అధ్రుశ్యం అవుతుంది. దానితో పాటే బలరాముడు కూడా కనిపించడు. 

----------------------------------------------------------------------------------------------------------------

ఆ చోటును వదిలి అరణ్యంలో డా తిరుగుతాడు క్రిష్ణుడు. నా దేహ త్యాగానికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తాడు. అక్కడక్కడా క్రిష్ణుడికి గతంలో దుర్వాసుడు ఇచ్చిన శాపం గుర్తుకు వస్తోంది. ఆ శాపం ఏమిటిటంటే అరికాలి నుంచే క్రిష్ణుని ప్రాణం పోతుంది. కొంత సమయం అటు ఇటు తిరుగుతాడు క్రిష్ణుడు. బాగా అలసిపోయి ఓ చోట నిద్రిస్తాడు. క్రిష్ణుని మరణానికి కారణమైన ఓ జింక అడవిలో అటూ ఇటూ తిరుగుతుంది. దానిని చూసిన ఓ వేటగాడు బాణంతో బలంగా కొడతాడు. ఇంతలో అది అద్రుశ్యం అవుతుంది. ఆ బాణం వచ్చి క్రిష్ణుని అరికాలిలో గుచ్చుకుంటుంది. 

----------------------------------------------------------------------------------------------------------------

ఇదంతా గమనించిన వేటగాడు క్రిష్ణుని వద్దకు వచ్చి స్వామి నన్ను క్షమించండి.. నేను కావాలని బాణం వేయలేదు అని వేడుకుంటాడు. క్రిష్ణుడు ఆ వేటగాడిని ఓదార్చి దిగులు చెందకు అని అతడిని సముదాయించి, తన దేహాన్ని విడిచి... తన స్వస్థానానికి వెళతాడు.


యాదవకుల నాశనం, జరిగిన సంఘటనలు దారుకుని ద్వారా పాండవులు తెలుసుకుంటారు. ద్రౌపది, శుభధ్ర మొదలగు వారు ఎంతో దుఖిఃస్తారు. అర్జునుడు క్రిష్ణుడు చెప్పిన విధంగా బయలుదేరి ద్వారకా నగరానికి చేరుకుంటాడు. బలరాముడు, క్రిష్ణుడు లేరని తెలుసుకుని ఎంతో బాధపడతాడు. అర్జునుడు వచ్చిన విషయం.. తెలుసుకున్న రుక్మిణీ, సత్యభామ, క్రిష్ణుని ఇతర భార్యలూ కూడా అర్జునుడిని చూసి భోరున విలపిస్తారు. వారందరినీ ఓదార్చుతాడు. అక్కడి నుంచి అర్జునుడు వసుదేవుని వద్దకు వెళతాడు.

----------------------------------------------------------------------------------------------------------------

అర్జునా.. క్రిష్ణుడు నాతో ఇలా అన్నాడు. అర్జుణుడు వస్తాడు. మీ అందరినీ రక్షిస్తాడు. కొన్ని గంటల్లో ద్వారక కూడా నీట మునగబోతుంది. మరణించిన వారందరికీ పిత్రుకార్యాలు అర్జునుడు చేస్తాడు అని క్రిష్ణుడు చెప్పిన మాటలు అతనికి చెప్పి వసుదేవుడు కూడా యోగ నిష్టతో తన దేహాన్ని వదిలిపోతాడు. మరణించిన వసుదేవునికీ, ఇతర వీరులకు అర్జునుడు అగ్ని సంస్కారాలు చేశాడు. 



మిగలిన యాదవ జనులందరినీ ఇంద్రప్రస్థానానికి తరలించడానికి తగిన సూచనలు, సన్నాహాలు చేశాడు. మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి.. అని చెప్పి బలరాముడు, క్రిష్ణుడిని వెతికేందుకు.. అర్జునుడు మరికొంత మంది ఆప్తులు బయలుదేరారు. అరణ్యంలో ఎంత వెతికినా ఎక్కడా వారి జాడ కనిపించలేదు. ఇక చేసేది ఏమీ లేక ఒక చెట్టుకింద కూర్చుని ఆలోచిస్తున్నారు. ఇంతలో అక్కడికి వేటగాడు వస్తాడు. ఓ దొరా.. ఎవరు మీరు.. ఎందుకు ఇక్కడ ఉన్నారు. 

----------------------------------------------------------------------------------------------------------------

సంగతి ఏమిటీ అని అడగగా జరిగిన విషయం అతనికి చెప్పాడు అర్జునుడు. ఓ నేను చూపిస్తాను. రండి దొరా.. అని అక్కడికి తీసుకుపోతున్నాడు. ఇదిగో సామి అక్కడ చెట్టు ఉంది కదా.. అక్కడే ఆ దేవుడు వున్నాడు.. పోయి చూడండి అని వేటగాడు వెళ్లిపోతాడు. అర్జునుడు పరుగున అక్కడికి చేరుతుంటే ఆ చెట్టు వేయికాంతులతో వెలిగిపోతూ కనిపించింది.. ఆ వెలుగుల్లో అక్కడే నేలపై క్రిష్ణుని శరీరం దేదీప్యమానంగా వెలుగులు చిమ్ముతూ వారికి కనిపించింది. క్రిష్ణుడిని చూసి భోరున విలపిస్తాడు. అతని రోధన వర్ణించడానికి వీలులేని విధంగా ఉంది. తెల్లవారితే ద్వారక మునిగిపోతుంది అన్న విషయం అతనికి గుర్తుకు వచ్చింది. క్రిష్ణుని నిర్యాణ వార్త చెబితే స్వర్గానికి వారు బయలుదేరరు. కాబట్టి వారికి చెప్పకుండా ఉండటమే మంచిది అనుకుంటాడు. 

----------------------------------------------------------------------------------------------------------------

తనతో పాటు వచ్చిన వారికి కూడా క్రిష్ణుని నిర్యాణ వార్త ఎవరికీ చెప్పకండి. జరగవలసిన కార్యం జరగదు అని వారికి చెబుతాడు. క్రిష్ణుని శరీరానికి సంస్కారాలు చేసి రాత్రికి రాత్రే ద్వారకకు వెళ్లి అక్కడ ఉన్న వారందరినీ బయలుదేర దీశాడు. వారంత తెల్లవారేలోపునే బయలు దేరగలిగారు. కానీ బయలు దేరి కొద్ది దూరం వెళ్తూండగానే సూర్యోదయం కావచ్చింది. ఇంతలో ద్వారక వారి కళ్ల ముందే మునిగిపోయింది. అర్జునుడు బయలు దేరదీసిన పరివారంలో సత్యభామా, రుక్మీణీ కూడా ఉన్నారు. కాని వారి ప్రాణనాధుడైన శ్రీ క్రిష్ణుడు మరణించినట్లు వారికి తెలియదు. స్త్రీలతో పాటు వజ్రుడు, మొదలైన పురుషులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

----------------------------------------------------------------------------------------------------------------

కొంత దూరం వెళ్లి.. పంచవటమనే చోట దారిలో కాసేపు ఆగారు. అర్జునుడు తప్పించి వేరే యేధులు ఎవరూ ఆ సమూహంలో లేరు. స్త్రీలు బాలలు, వ్రుద్ధులు మాత్రమే ఉన్నారు. వారి వద్ద భారీగా బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఒక దొంగల గుంపు వారిని చూసింది. స్త్రీల మీద పడి నగలు ఒలుచుకుంటూ ఉండగా.. అర్జునుడు ముందు హెచ్చరించాడు. వారు వినకపోయే సరికి గాంఢీవం ఎక్కు పెట్టి కిరాతకుల మీదకు బాణాలు సంధిస్తాడు. ఒక్క బాణం కూడా ఆ దొంగల గుంపును ఏమీ చేయలేక పోయింది. తేలికపాటి బాణాలు, కర్రలు, రాళ్లను పెట్టి మహా యోధుడైన గాంధీవిపై దాడి చేశారు. మహా అస్త్ర సంపన్నుడైన అర్జునుడికి విచిత్రంగా అనిపించింది. ఒక్క అస్త్రానికి సంబంధించిన మంత్రమూ, బాణములు పని చేయలేదు. అర్జునుడు ఎన్ని బాణాలు ప్రయోగించినా అతని అమ్ములపొదిలో భాణాలు తరిగిపోవు. కానీ అప్పుడు మాత్రం బాణాలు కాసేపటికే నిండుకున్నాయి.

----------------------------------------------------------------------------------------------------------------

అర్జునుడికి అర్ధం అయింది. దైవబలం లేదని తెలుసుకుని తన గాండీవాన్ని తిప్పి కిరాతకులను కొడుతూ రుక్మీణీ, సత్యభామ, బలరాముడి భార్యలను, కొందరు యాదవస్త్రీలను కాపాడగలిగాడు. తక్కిన స్త్రీలను కిరాతకులు బంధించారు. ధనాన్ని కొల్లగొట్టారు. చేయగలిగిన నాశనం చేసి వెళ్లిపోయారు. ఈ దాడి తరువాత మిగిలిన జనాన్ని తీసుకుని అర్జునుడు కురుక్షేత్రానికి వెళ్లాడు. అక్కడ ఆప్తులందరికీ జరిగింది చెప్పాడు. ఆపైన తన రాజ్యంలో వివిధ నగరాలను మిగిలిన యాదవ కుమారులకు పంచిపెట్టి, ఒక్కో కుటుంబపు బాధ్యత ఒక్కొక్కనికి అప్పగించి వారి పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు.

----------------------------------------------------------------------------------------------------------------

చివరికి ఒక రోజు బలరామ క్రిష్ణుల నిర్యాణం గురించి, ఏ కారణంగా అప్పుడు .. ఈ సంగతి చెప్పలేదన్న విషయం గురించి.. వారి భార్యలకు చెప్పాడు. ఇంతకాలమూ చెప్పనందుకు తనకు పాపం చుట్టుకుందని బాధపడగా ఆ యాదవకాంతలు అర్జునుడిని ఓదార్చారు. రుక్మీణీ, జాంబవతి, తదితర స్త్రీలు సహగమనం చేశారు. సత్యభామ, మరి కొందరూ తీవ్రమైన తపస్సు చేయడానికి అడవుతలకు వెళ్లిపోయారు. ఈ రకంగా ద్వాపర యుగం ముగిసింది.

#varahitalks

dronacharya mahabharat history in telugu

ద్రోణాచార్యుడు గురించి నమ్మలేని నిజాలు

---------------------------------------------------------------

 ద్రోణాచార్యుడు.. ఈ పేరు వింటేనే అస్త్ర, శస్త్ర విద్యలు గర్తుకు వస్తాయి..

అతని బలపరాక్రమానికి రణరంగం వణికిపోతుంది... ఎదురుగా నిలిచిన యోధుల గుండెలు గడగడలాడిపోతాయి... ద్రోణుడిని తట్టుకోవడం అంత తేలిక కాదు... పాండవులకు, కౌరవులకు అతనే గురువు... అలాంటి ద్రోణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎలా పోరాడాడు.. దుర్యోధనుడు ఎందుకు అవమానించాడు. కృష్ణుడు ఎందుకు అబద్ధం చెప్పించాడు... ద్రోణుడు ఎలా చనిపోయాడు ఇలాంటి మరెన్నో విషయాలను ఈ వీడియో తెలుసుకుంటారు.


కౌరవులకూ పాండవులకూ గురువొక్కడే!.. అతడే ద్రోణాచార్యుడు. ధనుర్విద్యలందు ఆయనకు ఆయనేసాటి. తండ్రి భరద్వాజ మహర్షి దగ్గర వేద వేదాంగాలు నేర్చుకున్నా డు. అస్త్ర, శస్త్ర విద్యలు మరో బలం. తండ్రి స్నేహితుడు.. అగ్నివేశ్యుడైన ముని దగ్గర ఆగ్నేయాస్త్రం ఉపదేశం పొందాడు. అన్నీవున్నా ఏనాడు సిరి సంపదలు ఆశించని యేధుడు.


ద్రోణుడు కృపాచార్యుని చెల్లెలైన కృపిని పెళ్ళాడాడు. అశ్వత్థామ అనే కొడుకును కన్నా డు. పేదరికాన్ని భరించలేక ఒకనాడు పరవరాముని దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే పరశురాముడు ఉన్న ధనమంతా దానం చేసేసాడు. మిగిలింది విద్యాధనమే.


దివ్యాస్త్రాలను ద్రోణుడికి దానంగా ఉపదేశించాడు. అయితే దారిద్య్ర్యం తీరే దారి ద్రోణుని కి కనిపించలేదు. అప్పుడు కలిసి విద్య నేర్చుకున్న చిన్ననాటి మిత్రుడు గుర్తుకు వచ్చాడు. ఆలస్యం చేయకుండా పాంచాల దేశం వెళ్ళి తనని తాను గుర్తుచేసుకొని సహాయ పడమని అర్థించాడు. స్థాయి మరిచి స్నేహితుడుగా ద్రోణుడు ప్రవర్తించడం ద్రుపదుడికి నచ్చలేదు. అందుకే అవమానించి పంపాడు. బాధపడి వచ్చేసాడే కాని ద్రోణుని మనసులో సరైన సమయంలో సరైన జవాబు చెప్పాలనుకున్నాడు.


పిల్లలుగా వున్నప్పుడు.. పాండవులూ, కౌరవులూ ఆడుకుంటూ ఉండగా బంతి నీళ్ళలో పడింది. ధర్మరాజు వేలి ఉంగరం కూడా నీటిలో పడింది. బాణం మీద బాణం వేసి బాణానికి బాణం గుచ్చేలా చేసి నీళ్ళలోని బంతినీ ఉంగరాన్ని తీసి ఇచ్చాడు ద్రోణుడు. ఈ విషయం పిల్లల ద్వారా భీష్మునికి తెలిసింది. ద్రోణాచార్యుడిని గౌరవించి.. విద్య నేర్పమని అర్థించడంతో కౌరవ, పాండవులకు గురువయ్యాడు ద్రోణుడు. గురుదక్షిణగా ద్రుపదుణ్ని బంధించి తెమ్మని కోరాడు. కౌరవుల వల్ల కాలేదు. భీముడూ, అర్జునుడూ వెళ్ళి యుద్ధం చేసి మరీ ద్రుపదుణ్ని బందీగా తెచ్చి కానుకగా ఇచ్చాడు. ద్రోణుని పగ తీరింది. మందలించి అర్ధ రాజ్యం ఇచ్చి వదిలేసాడు. ద్రుపదుడు అవమానంతో మహాయజ్ఞం చేసాడు. ద్రుష్టద్యుమ్నుడిని కన్నాడు. ద్రోణుని చంపేదివాడే!



ద్రోణునికి అర్జునుడు అత్యంత ప్రీతి పాత్రమయ్యాడు. అందుకనే నన్ను మించిన వీరుడుగా తయారు చేస్తానన్నాడు. ఏకలవ్యుడు ఎక్కడ మించి పోతాడోనని బొటన వేలుకోరి అర్జునునికి అడ్డులేకుండా చేసాడు. పాండవులంటే ద్రోణునికి అభిమానం ఉంది. కాని దుర్యోధనుడు ప్రభువు. పైగా భీష్ముడు నేల కూలాక ఆ సేనాధిపతి స్థానం ద్రోణునికే ఇచ్చారు. అందుకే కౌరవుల విజయమే కోరుకున్నాడు. ధర్మరాజుని చంపకుండా పట్టి తెచ్చి అప్పగిస్తానని, నీ కోరిక తీరుస్తానని ధుర్యోధనునికి మాటయిచ్చాడు ద్రోణుడు.


కురుక్షేత్రం ముగియడానికి మూడు రోజుల ముందు ద్రోణుడు యుద్ధంలో తన శక్తిని చూపించేసరికి ఎవ్వరూ ముందు నిలవలేకపోయారు. ద్రుపదుడు, విరాట్ రాజు ద్రోణుని చేతిలో చనిపోయారు. ఎదురునిలవడం పాండవులకూ కష్ట మయింది. ఎందుకంటే.. మీరు మావైపు యుద్ధం సరిగా చేయడం లేదు. పాండవుల మీద ప్రేమతో వారిని సంహరించలేకపోతున్నారు. అని దుర్యోధనుడు అవమానించాడు.. దాంతో ద్రోణుడు చెలరేగిపోయాడు. శ్రీకృష్ణుడు ఇదంతా గమనించాడు. ఉపాయం చేసాడు. భీముడు "అశ్వత్థామ" అనే ఏనుగుని చంపి, "అశ్వత్థామా హతః." అని అరిచాడు. ద్రోణుడు విన్నాడు. తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడా? నమ్మలేకపోయా డు. ధర్మరాజుని ధర్మ బద్ధుడని అడిగాడు. ధర్మరాజు కూడా "అశ్వత్థామ హతం" అని అరిచి, మెల్లగా “కుంజరః కుంజరః" అన్నాడు. ద్రోణుడు తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడనుకొని కుప్పకూలిపోయాడు. ధనుర్భాణాలను వదిలేసాడు. అచేతనంగా ఉండిపోయాడు. అప్పుడు దుష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణుని తలను ఖండించాడు. అధర్మ యుద్ధంలో అతిరధుడలా కన్నుమూసాడు.

గురువుగారి మరణానికి కౌరవులే కాదు, పాండవులూ దుఃఖించారు. కొంతసేపు యుద్ధాన్ని ఆపేసారు కూడా!

వినాయక చవితి అంటే ఏమిటి..? చవితి రోజు ఏం చేయాలి..?


 వినాయక చవితి అంటే ఏమిటి..? చవితి రోజు ఏం చేయాలి..?

 వినాయక చవితి అంటే ఏమిటి..? చవితి రోజు ఏం చేయాలి..? ఎలా వ్రతం చేస్తే కోరిన కోర్కెలు తీరతాయి..? పార్వతీ దేవి ఇచ్చిన శాపం ఏమిటి..? వినాయకుని వ్రత కథ రహాస్యం ఏమిటి..? శ్రీ క ష్ణుడికి వచ్చిన కష్టం ఏమిటి..? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. మీరు చేయాల్సింది ఒక్కటే.. వీడియోని చివరి వరకూ చూడండి. మీ విఘ్నాలు తొలగిపోయి సుఖసంతోషాలతో, సిరి సంపదలతో జీవిస్తారు.



వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటారు. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.

‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’ అని చదువుకోవాలి.

వినాయక వ్రత కథ....

వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.

తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.

దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు....ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు...గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.



శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

ఋషి పత్నులకు నీలాపనిందలు....

పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానం......

ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు.

‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.

ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి... అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.

------------------------------------------------------------------

ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం.. మన చానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ పై నొక్కండి. మేము వీడియో పోస్ట్ చేయగానే ముందుగా మీకే వస్తుంది.

మార్కండేయ చరిత్ర పూర్తి కధ

 మార్కండేయ చరిత్ర పూర్తి కధ

--------------------------------------------------------------

అల్పాయుషు కలిగిన బాలుడు... 'ఏడు కల్పాల' వరకు ఆయుషు ఎలా పొందాడు.. పరమేశ్వరుడు ఇచ్చిన వరం ఏమిటి..? యమధర్మరాజునే ఎందుకు దిక్కరించాడు. శివుడికి కోపం ఎందుకు వచ్చింది. మార్కండేయుని గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు... చివరి వరకూ చూడండి. శివుని అనుగ్రహం ఉంటుంది.



పూర్వకాలంలో మృకండుడు అని ఒక మహార్షి ఉండేవాడు. ఆయన భార్య మరుద్వతీ దేవి. పరమసాధ్వి, మహా పతివ్రత, వారికి సంతానం లేదు. ఒక రోజు మిగిలిన మహార్షులతో కలిసి మృకండుడు సత్యలోకానికి వెళ్లాడు. అక్కడ సంతానము లేనివారికి ఉత్తమ గతులు లేవు. అందుచేత నీకు ఈ లోకంలోకి ప్రవేశం లేదు అంటూ మృకండుని ఆపేశారు ద్వారపాలకులు. చేసేది లేక ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు.


ఆ దంపతులు హిమాలయ పర్వాతాలకు వెళ్లి శివుని గురించి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై ' ఏం వరం కావాలో కోరుకోండి ' అన్నాడు. ఆ దంపతులు సంతాన భాగ్యము కావాలి అన్నారు. దానికి ఈశ్వరుడు బుషి దంపతులారా..! మీకు సంతాన యోగం లేదు. అయినా తపస్సు చేసి అర్థించారు కాబట్టి. బుద్ధివంతుడు, వేదవేదాంగవిధుడు అయిన బాలుడిని ప్రసాదిస్తాను. కాని అతని ఆయుష్షు పదహారు సంవత్సరాలే ఉంటుంది. అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. కొంత కాలానికి మృకండుని భార్య గర్భవతి అయి పండంటి మగబిడ్డను ప్రసవించింది. మునీశ్వరులంతా ఆ బాలుడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు.


మార్కండేయుడు గొప్ప శివభక్తుడు. పిల్లవాడికి ఐదవ ఏట అక్షరాభ్యాసం చేశారు. మునీశ్వరులంతా అతన్ని 'దీర్ఘాయురస్తూ' అని దీవించారు. బాలుడు అల్పాయుష్కుడు అని ఈశ్వరుడన్నాడు. దీర్ఘాయువు కమ్మని మునీశ్వరులు దీవించారు. ఏం జరుగుతుందో..? దైవ సంకల్పం.. ఏ రకంగా ఉన్నదో అని ఊరుకున్నాడు మృకండుడు.


మార్కండేయుడు ఏక సంతాగ్రాహి. అందుచేత వేదవేదాంగాలు అన్నింటినీ కొద్ది రోజులలోనే నేర్చుకున్నాడు. అతి చిన్న వయస్సులోనే మహా పండితుడయిన మార్కండేయుడిని చూసి చుట్టు ప్రక్కల వాళ్లు, తల్లిదండ్రులూ, అందరూ ఆనందించారు.


పిల్లవాడు మహా పండితుడు అనే ఆనందం ఒక ప్రక్క. అల్పాయుష్కుడనే బాధ మరో ప్రక్క.. తల్లిదండ్రులు మాత్రం ఆశ నిరాశల మధ్య ఊగుతున్నారు. ఈ రకంగా పదిహేను సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున నారద మునీంద్రుడు మృకండుని ఆశ్రమానికి వచ్చాడు. మృకండుడు నారదుడికి ఆతిధ్యం ఇచ్చి గౌరవించాడు. కుశల ప్రశ్నల తరువాత. మాటల మధ్యలో మార్కండేయుడిని చూశాడు. సాముద్రిక లక్షణాలను భట్టి ఈ బాలుడు చాలా గొప్పవాడవుతాడు. భక్త శిఖామణి, లోకైక పూజ్యుడవుతాడు. కానీ ఇతడికి ఇంకొక సంవత్సరమే ఆయుర్ధాయమున్నది. విచారించి లాభం లేదు. ఈ బాలుడు శివభక్తుడు, శివుడు భక్త సులభుడు, ఈశ్వరుడిని భక్తితో మెప్పించి వరాలు పొందటం అతి తేలిక. ఈ సంవత్సర కాలంలో మార్కండేయుడు శివుడిని మెప్పించగలడు. నాయనా..! గోదావరి నదీ తీరములో గౌతముడి సిద్ధాశ్రమమున్నది. 


పూర్వకాలంలో అదితి, కశ్యపులకు వామనుడు అక్కడే జన్మించాడు. అందుచేత అది సిద్ధ జనార్ధన క్షేత్రము అని కూడా పిలవబడుతుంది. అక్కడ రాజరాజేశ్వరి, సోమలింగేశ్వరులున్నారు. గతంలో శ్వేతకేతు అనే రాజు. శుక్రుడూ ఆ ప్రాంతంలోనే పరమేశ్వరుణ్ణి ఆరాధించారు. నువ్వు కూడా అక్కడికి వెళ్లి శివుని గురించి తపస్సు చెయ్యి అన్నాడు. మార్కండేయుడు గౌతమీ తీరం చేరాడు. నదిలో స్నానం చేసి, గౌతముడికి నమస్కరించి తపస్సు చెయ్యటం ప్రారంభించాడు. ఇలా ఒక యేడాది గడిచిపోయింది. మాఘశుద్ధ పంచమి మార్కండేయుని జన్మదినం. ఆ రోజుతో మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు నిండాయి. మార్కండేయుని ఆయుషు తీరింది. యమధర్మరాజు దూతలను పంపాడు. యమధూతలను చూసి మార్కండేయుడు శివుణ్ణి శరణు వేడాడు. శివాలయం లోపలికి వెళ్లి కూర్చున్నాడు. యమధూతలు ఆలయ ప్రవేశం చేయబోయారు. కాలభైరవుడు గధతో వారిని అడ్డగించాడు. లోపలికి ప్రవేశం లేదు వెళ్లిపోండి అని గద్దించాడు. దూతలు జరిగిన విషయాలన్నీ తమ ఏలికకు విన్నవించారు. మాఘశుద్ధ సప్తమి.. యముడు దున్నపోతు నెక్కి మార్కండేయుని కోసం బయలుదేరాడు. నదీ స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తున్నాడు మార్కండేయుడు. 


మార్కండేయుడిని రమ్మని పిలిచాడు యముడు. పూజ మధ్యలో ఉన్నది. శివపూజకు అంతరాయం కలిగించవద్దు. సకల ధర్మవేత్తవు.. నీకు తెలియని ధర్మం లేదు కదా..? అన్నాడు మార్కండేయుడు.


తను పిలిస్తే ఒక బాలుడు రాననడంతో యమధర్మరాజుకు కోపం వచ్చింది వెంటనే చేతిలోని పాశం మార్కండేయుడి మీదకు విసిరాడు. మార్కండేయుడు శంకరా పాహిమాం.. అంటూ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. యముడు కోపంతో పాశాన్ని లాగాడు. ఆ పాశము శివలింగాన్ని కూడా కుదిపివేసింది. ఢమ ఢమ ధ్వనులతో, పెళ పెళ రావాలతో కోటి సూర్యుల కాంతితో ఐదు ముఖాలు, మూడు కనులు.. ఖడ్గం, పరశువు, శూలము ధరించి గజ చర్మాంబరధారి అయిన ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమ భక్తితో నమస్కరించాడు మార్కండేయుడు. నీకు భయం లేదు. నిశ్చింతగా ఉండు అని మార్కండేయుడికి అభయమిచ్చాడు. సమవర్తీ..! ధర్మ నిర్వహణలో నీవు హద్దు మీరి ప్రవర్తించావు. ఈ బాలుడు నా భక్తుడు. అతడి జోలికి ఎందుకు వెళ్లావు. అంటూ యముణ్ని శిక్షించాడు.


బ్రహ్మాది దేవతలంతా వచ్చి యముడు తన పని తాను చేశాడు. కాబట్టి అతన్ని క్షమించమని వేడగా శివుడు శాంతించి.. యమధర్మరాజా..! నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు కాని ' నా భక్తుల జోలికి మాత్రం వెళ్లకు ' అని ఆజ్ఞాపించాడు. మార్కండేయుడికి ' ఏడు కల్పాల ' వరకు ఆయుషునిచ్చి దీవించాడు. ఈ విధంగా పదహారు సంవత్సరాలు అయుషు కలిగిన మార్కండేయుడు ' ఏడు కల్పాల' వరకు ఆయుష్షు పొందాడు. అందుకే శివుడిని కొలిచిన వారికి ఎలాంటి బాధలు, కష్టాలు ఉండవని మార్కండేయుని కథ చెబుతుంది.


ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం.. మన చానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆలపై నొక్కండి. మేము వీడియో పోస్ట్ చేయగానే ముందుగా మీకే వస్తుంది.


 Ep3 ఎపిసోడ్ నం. 3 సృష్టి ఎలా మొదలైంది సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహా సముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుం...